Jaipur: పింక్ సిటీ పసుపుగా ఎందుకు మారిందో తెలుసు.. ధోనీపై రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ABN , First Publish Date - 2023-04-28T08:34:41+05:30 IST

ప్రస్తుత ఐపీఎల్‌లో అందరి కళ్లూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీపైనే ఉన్నాయి. ఇదే తన చివరి ఐపీఎల్ అని ధోనీ హింట్లు ఇస్తుండడంతో అతడు ఏ నగరంలో మ్యాచ్ ఆడితే అక్కడకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. తమ స్వంత జట్టుకు కాకుండా ధోనీ టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నారు.

Jaipur: పింక్ సిటీ పసుపుగా ఎందుకు మారిందో తెలుసు.. ధోనీపై రాజస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) అందరి కళ్లూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ధోనీ (MS Dhoni)పైనే ఉన్నాయి. ఇదే తన చివరి ఐపీఎల్ అని ధోనీ హింట్లు ఇస్తుండడంతో అతడు ఏ నగరంలో మ్యాచ్ ఆడితే అక్కడకు ప్రేక్షకులు (Fans) క్యూ కడుతున్నారు. తమ స్వంత జట్టుకు కాకుండా ధోనీ టీమ్‌కు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఈ మ్యాచ్‌లను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్న ``జియో సినిమా``కు (Jio Cinema) ధోనీ ఆడుతున్న సమయంలో వ్యూయర్‌షిప్ విపరీతంగా పెరుగుతోంది. అన్ని చోట్లు ధోనీ మ్యానియా నెలకొంది.

గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (CSKvsRR) జట్లు జైపూర్‌ (Jaipur)లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో స్టేడియం మొత్తం ఎల్లో జెర్సీలతో నిండిపోయింది. ప్రేక్షకులు ధోనీకి మద్దతుగా నిలవడం గురించి రాజస్థాన్ టీమ్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) మాట్లాడాడు. ``ఇది మాకు చాలా ప్రతిష్టాత్మకమైన మ్యాచ్. ఐపీఎల్‌లో ఇది మాకు 200వ గేమ్. స్టేడియంలో ప్రేక్షకులు మాకు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ, అందరూ పసుపు జెర్సీలు వేసుకున్నారు. పింక్ సిటీ ఇలా పసుపుగా ఎందుకు మారిందో నాకు తెలుసు. తమ అభిమాన ఆటగాడిని (ధోనీ) అభిమానులు ఘనంగా రిసీవ్ చేసుకుంటున్నార``ని సంజూ పేర్కొన్నాడు.

MS Dhoni: ధోనీకి వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే.. వికెట్ల వెనుక నుంచి ఎలా రనౌట్ చేశాడో చూడండి..

మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ``ఈ స్టేడియం నాకు చాలా ప్రత్యేకం. నా తొలి వన్డే సెంచరీ వైజాగ్‌లో చేసినా.. నా కెరీర్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్ (శ్రీలంకపై 183 పరుగులు) ఇక్కడే ఆడాను. ప్రస్తుతం నేను ఎక్కడకు వెళ్లినా అభిమానులు నాకు మద్దతుగా నిలుస్తున్నారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాన``ని ధోనీ తెలిపాడు.

Updated Date - 2023-04-28T08:34:41+05:30 IST