Asian Presidents Cup title : హ్యాండ్‌బాల్‌ విజేత భారత్‌

ABN , First Publish Date - 2023-02-17T01:06:47+05:30 IST

భారత మహిళల హ్యాండ్‌బాల్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ఆసియా ప్రెసిడెంట్స్‌ కప్‌ టైటిల్‌ను తొలిసారి దక్కించుకుంది. ఆసియా హ్యాండ్‌బాల్‌

Asian Presidents Cup title : హ్యాండ్‌బాల్‌ విజేత భారత్‌

ఆసియా ప్రెసిడెంట్స్‌ కప్‌ కైవసం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి-స్పోర్ట్స్‌): భారత మహిళల హ్యాండ్‌బాల్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక ఆసియా ప్రెసిడెంట్స్‌ కప్‌ టైటిల్‌ను తొలిసారి దక్కించుకుంది. ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఆధ్వర్యంలో జోర్డాన్‌ వేదికగా జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో శైలజా శర్మ సారథ్యంలోని భారత జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌లు నెగ్గి ఓవరాల్‌గా 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆతిథ్య జోర్డాన్‌ జట్టు 8 పాయింట్లతో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన భారత జట్టును జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు అభినందించారు.

Updated Date - 2023-02-17T01:06:49+05:30 IST