Hockey World Cup: న్యూజిలాండ్ చేతిలో షాకింగ్ ఓటమి.. హాకీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్ర్కమణ..

ABN , First Publish Date - 2023-01-22T21:55:55+05:30 IST

ఒడిశా వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్ 2023 (Hockey World cup 2023) నుంచి టీమిండియా (Team India) నిష్ర్కమించింది.

Hockey World Cup: న్యూజిలాండ్ చేతిలో షాకింగ్ ఓటమి.. హాకీ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్ర్కమణ..

భువనేశ్వర్: ఒడిశా వేదికగా జరుగుతున్న హాకీ వరల్డ్ కప్ 2023 (Hockey World cup 2023) నుంచి టీమిండియా (Team India) నిష్ర్కమించింది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం వేదికగా ఆదివారం ఖచ్చితంగా గెలవాల్సిన క్రాస్‌ఓవర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఇండియా ఓటమిపాలైంది. దీంతో క్వాటర్ ఫైనల్ రేసు నుంచి వైదొలగింది. మ్యాచ్ పూర్తి టైమ్ ముగిసే సమయానికి ఇరుజట్లు 3-3 గోల్స్ చేయడంతో షూటౌట్‌కు దారితీసింది. అయితే షూటౌట్‌లో ఇండియా 4 గోల్స్, న్యూజిలాండ్ 5 గోల్స్ చేయడంతో ఓటమి అనివార్యమైంది. కాగా ఆట ఫుల్ టైమ్‌లో భారత్ తరపున లలిత్ ఉపాధ్యాయ్, సుఖ్‌జీత్ సింగ్, వరుణ్ కుమార్ తలో గోల్ చేశారు.

Untitled-7.jpg

Updated Date - 2023-01-22T21:58:38+05:30 IST