మలేసియాపై భారత్‌ గెలుపు

ABN , First Publish Date - 2023-06-06T00:57:35+05:30 IST

మహిళల జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఒక గోల్‌ వెనుకంజలో ఉండీ పుంజుకున్న మన మహిళలు 2-1తో మలేసియాపై గెలుపొందారు....

మలేసియాపై భారత్‌ గెలుపు

కకామిఘార (జపాన్‌): మహిళల జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు విజయపరంపర కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఒక గోల్‌ వెనుకంజలో ఉండీ పుంజుకున్న మన మహిళలు 2-1తో మలేసియాపై గెలుపొందారు. ముంతాజ్‌ ఖాన్‌ (10), దీపిక (26) భారత్‌ తరపున గోల్స్‌ చేయగా డయాన్‌ నజేరి (6) మలేసియాకు ఏకైక గోల్‌ అందించింది. ఈ విజయంతో గ్రూప్‌ ‘ఎ’లో మనోళ్ల అగ్రస్థానం మరింత పటిష్టమైంది. తొలి మ్యాచ్‌లో 22-0తో ఉజ్బెకిస్థాన్‌ను భారత్‌ చిత్తు చేసిన విషయం విదితమే. ఇక మంగళవారం జరిగే పోరులో కొరియాతో భారత్‌ తలపడనుంది.

Updated Date - 2023-06-06T00:57:35+05:30 IST