Share News

క్రీడల మంత్రికి విన్నవించినా..

ABN , Publish Date - Dec 22 , 2023 | 04:23 AM

బ్రిజ్‌భూషణ్‌ అనుచరుడు ఎవరూ సమాఖ్య ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను పలుమార్లు కలిసి బజ్‌రంగ్‌, సాక్షి, వినేశ్‌ విన్నవించారు..

క్రీడల మంత్రికి విన్నవించినా..

మీడియా సమావేశంలో వినేశ్‌, బజ్‌రంగ్‌

బ్రిజ్‌భూషణ్‌ అనుచరుడు ఎవరూ సమాఖ్య ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ను పలుమార్లు కలిసి బజ్‌రంగ్‌, సాక్షి, వినేశ్‌ విన్నవించారు. దాంతో బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు ప్రతీక్‌, అతడి అల్లుడు విశాల్‌ సింగ్‌ ఎన్నికల బరిలో దిగలేదు. ‘బ్రిజ్‌భూషణ్‌ అనుచరుడెవరూ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరలేదు’ అని టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బజ్‌రంగ్‌ నిర్వేదంతో చెప్పాడు. ‘మేం ఎంతో పోరాడాం. న్యాయం కోసం రాబోయే రెండు, మూడు తరాల రెజ్లర్లు పోరాటం చేయాల్సి ఉంటుంది’ అని అన్నాడు. ఆటలో తాను కొనసాగుతానో..లేనో చెప్పలేనన్నాడు. సంజయ్‌ సింగ్‌ జమానాలో మహిళా రెజ్లర్లకు వేధింపులు తప్పవని వినేశ్‌ ఆందోళన వ్యక్తంజేసింది. ‘సంజయ్‌ లాంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికవడం రాబోయే రోజుల్లో మహిళా రెజ్లర్లపై వేధింపులు మరింత ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం తెరవెనుక జరుగుతున్న వేధింపులు ఇకపై బహిరంగంగానే చోటు చేసుకుంటాయి. దేశ రెజ్లింగ్‌ భవిష్యత్‌ అంధకారంగా కనిపిస్తోంది’ అని ఆమె వ్యాఖ్యానించింది.

Updated Date - Dec 22 , 2023 | 04:23 AM