IPL trophy: ఐపీఎల్ ట్రోఫీ చెన్నై చేరుకున్న తర్వాత.. నేరుగా..

ABN , First Publish Date - 2023-05-30T22:01:13+05:30 IST

ఐపీఎల్-16 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది.

IPL trophy: ఐపీఎల్ ట్రోఫీ చెన్నై చేరుకున్న తర్వాత.. నేరుగా..

చెన్నై: ఐపీఎల్-16 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు చెన్నై టీటీడీ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి (TTD Sri Venkateswaraswamy temple) ట్రోఫీని (IPL trophy) తీసుకొచ్చారు. ట్రోఫీని స్వామి ముందు ఉంచి ఆశ్సీసులు తీసుకున్నారు. చెన్నై 5వ సారి ఐపీఎల్ కప్ గెలుచుకుంది. చెన్నై టీమ్‌కి అభినందనలు తెలిపారు. స్వామి బ్లెస్సింగ్స్ కోసం ఈ రోజు విమానాశ్రయం నుంచి నేరుగా వెంకట్నారాయణన్ రోడ్డులో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి ట్రోఫీని తీసుకొచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన ప్రతిసారీ ట్రోఫీని జట్టు సభ్యులు ఆలయానికి తీసుకొస్తారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSKvsGT) మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

TTD.jpg

కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్ ఐపీఎల్-16లో (IPL 2023) అదరగొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను (GTvsCSK) 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఐపీఎల్ చరిత్రలో ఐదో సారి టైటిల్ అందుకుంది. వర్షం కారణంగా చెన్నై లక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. చెన్నై టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అందరూ తమ వంతు సహకారం అందించారు. కాన్వే (47), రుతురాజ్ (26), రహానే (27), శివమ్ దూబే (32 నాటౌట్) మెరుపులు మెరిపించారు (IPL 2023 Final Match).

విజయం కోసం చివరి ఓవర్లో చెన్నై జట్టుకు 13 పరుగులు అవసరం అయ్యాయి. అయితే ఆ ఓవర్లో తొలి నాలుగు బంతులకు మూడు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ దశలో చెలరేగిన జడేజా (Ravindra Jadeja) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి చెన్నైకి మరపురాని విజయాన్ని అందించాడు. చెన్నై టీమ్‌ను, అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూల్‌గా ఉండే ధోనీ ఈ మ్యాచ్ చివరి ఓవర్లో కాస్త ఎమోషనల్‌గా కనిపించాడు.

Updated Date - 2023-05-30T22:05:51+05:30 IST