Share News

WorldCup Final: ప్రపంచకప్ టీమిండియాదేనా? ఐసీసీ విడుదల చేసిన ఫొటోలు చూస్తే అర్థమవుతోంది ఏంటంటే..

ABN , First Publish Date - 2023-11-19T14:53:03+05:30 IST

దాదాపు నెలన్నరగా క్రికెట్ ప్రేమికులను అలరించిన ప్రపంచకప్ క్లైమాక్స్‌కు చేరుకుంది. అత్యుత్తమ జట్లు అయిన టీమిండియా, ఆస్ట్రేలియా ఫైన్‌ల్ బరిలోకి దిగాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తోంది.

WorldCup Final: ప్రపంచకప్ టీమిండియాదేనా? ఐసీసీ విడుదల చేసిన ఫొటోలు చూస్తే అర్థమవుతోంది ఏంటంటే..

దాదాపు నెలన్నరగా క్రికెట్ ప్రేమికులను అలరించిన ప్రపంచకప్ (World Cup 2023) క్లైమాక్స్‌కు చేరుకుంది. అత్యుత్తమ జట్లు అయిన టీమిండియా, ఆస్ట్రేలియా ఫైన్‌ల్ బరిలోకి దిగాయి (WorldCup Final). అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తోంది (Indian Vs Australia). అయితే ఈ టోర్నీ విజేత టీమిండియానే అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఐసీసీ (ICC) విడుదల చేసిన ఫొటోల ఆధారంగా అభిమానులు అంచనా వేస్తున్నారు.

ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లు కప్‌తో దిగిన ఫొటోలను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోహిత్ శర్మ (Rohit Sharma), ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (Pat Cummins) ప్రపంచ కప్ 2023 ట్రోఫీతో కనిపిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు ప్రపంచకప్‌ను గెలవబోతోందని ఈ ఫోటోను క్లిక్ చేసిన తీరు తెలియజేస్తోంది. గతంలో కూడా ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల కెప్టెన్లూ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. గతంలో మూడు సార్లు ప్రపంచకప్‌నకు ఎడమ వైపు నిల్చున్న కెప్టెన్ మాత్రమే విజేతగా నిలిచారు.

icc1.jpg

2011 ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు ధోనీ, 2015 ఫైనల్‌కు ముందు క్లార్క్, 2019 ఫైనల్‌కు ముందు ఇయాన్ మోర్గాన్.. ఇలా అందరూ ప్రపంచకప్‌నకు ఎడమ వైపే నిల్చున్నారు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన ఫొటోల్లో కూడా కప్‌నకు రోహిత్ ఎడమ వైపే నిల్చున్నాడు. దీంతో ఈ టోర్నీ విజేత టీమిండియానే అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

icc2.jpg

Updated Date - 2023-11-19T14:55:23+05:30 IST