Jafta: ఆల్కహాల్ వ్యసనం నుంచి మళ్లీ ఆటలోకి..
ABN , First Publish Date - 2023-02-28T03:12:55+05:30 IST
మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆడిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ సినాలో జాఫ్తాకు 28 ఏళ్లే. కానీ ఈ వయస్సులోనే ఆమె క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావించింది.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆడిన దక్షిణాఫ్రికా వికెట్ కీపర్, బ్యాటర్ సినాలో జాఫ్తాకు 28 ఏళ్లే. కానీ ఈ వయస్సులోనే ఆమె క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావించింది. కారణం కామన్వెల్త్ క్రీడల్లో జాఫ్తా ఆట తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించడంతోపాటు ఆమెపై జాతి వివక్ష వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వెల్లువెత్తడం. ఆ విమర్శలు, వ్యాఖ్యలతో బాగా కుంగిపోయిన జాఫ్తా.. మద్యానికి బానిసైంది. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని కూడా నిర్ణయించుకుంది. కానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, జట్టు సహచరులు నచ్చజెప్పడంతో విరమించుకుంది. ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడేందుకు దాదాపు రెండు నెలలు చికిత్స కూడా తీసుకుంది. డిసెంబరులో ఆ చికిత్స పూర్తి కాగానే తిరిగి ఆటపై మనసు పెట్టింది. దాంతో జాతీయ జట్టులో జాఫ్తాకు మళ్లీ చోటు లభించింది. టీ20 వరల్డ్ కప్ రన్నరప్ దక్షిణాఫ్రికా జట్టులో జాఫ్తా సభ్యురాలు.