Rohit Sharma captain : రోహిత్ కెప్టెన్సీకి.. కంగారూ ‘టెస్టు’
ABN , First Publish Date - 2023-02-06T00:24:31+05:30 IST
ఫిబ్రవరి 2022లో టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమితుడయ్యాడు. అప్పటి వరకు కోహ్లీ గైర్హాజరీలోనే బాధ్యతలు తీసుకున్న అనుభవం ఉంది. తాజాగా కెప్టెన్ హోదాలో రోహిత్ అత్యంత కీలక పరిస్థితిని ఎదుర్కొనబోతున్నాడు. ఈనెల 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్
ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ.. టీమిండియాను మూడు ఫార్మాట్లలోనూ విజయవంతంగా
నడిపించిన కెప్టెన్లుగా నిలిచారు. ఇక నాటకీయ పరిస్థితుల మధ్య జట్టు పగ్గాలు తీసుకున్న రోహిత్ మాత్రం నాయకుడిగా తనదైన ముద్ర వేయలేక
పోయాడు. ఏడాది క్రితమే సారథిగా మారిన ఈ హిట్‌మ్యాన్ గాయాల కారణంగా ఆడింది రెండు టెస్టులే. తాజాగా అతడి నాయకత్వ పటిమకు
ఆస్ట్రేలియా ‘టెస్టు’ పెట్టబోతోంది. అంతేకాదు.. ఈ సిరీస్ ఫలితంపైనే వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్ బెర్త్ ఆధారపడి ఉంది. దీంతో కెప్టెన్‌గా రోహిత్ జట్టును ఎలా నడిపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
ఫిబ్రవరి 2022లో టీమిండియాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమితుడయ్యాడు. అప్పటి వరకు కోహ్లీ గైర్హాజరీలోనే బాధ్యతలు తీసుకున్న అనుభవం ఉంది. తాజాగా కెప్టెన్ హోదాలో రోహిత్ అత్యంత కీలక పరిస్థితిని ఎదుర్కొనబోతున్నాడు. ఈనెల 9 నుంచి ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కాబోతుంది. ఈ మ్యాచ్‌లు కచ్చితంగా అతడి నాయకత్వ ప్రతిభకు గీటురాయిగా నిలువనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రోహిత్ ఆధ్వర్యంలో ఆసియాకప్, ఐసీసీ టీ20 వరల్డ్‌క్‌పలో చేదు ఫలితాలు వచ్చాయి. దీనికితోడు అతడి ముందు వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్ కూడా ఉంది. ఇందులో చోటు దక్కాలంటే ఆసీ్‌సపై 2-0 లేక 3-1 తేడాతోనైనా భారత్ గెలవాల్సి ఉంటుంది. మరోవైపు 2004 నుంచి స్వదేశంలో కంగారూలపై భారత్‌దే ఆధిపత్యం. అంతేకాకుండా చివరి మూడు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలను భారతే గెలుచుకుంటూ వస్తోంది. మరిప్పుడు కీలక ఆటగాళ్లు లేని వేళ జట్టును విజయం వైపు నడిపించే బాధ్యత రోహిత్‌పై ఉంది. రాబోయే నాలుగు టెస్టులతో పాటు అంతా సవ్యంగా జరిగితే డబ్ల్యుటీసీ ఫైనల్ ప్రదర్శన కూడా రోహిత్ కెప్టెన్సీ భవిష్యత్‌ను తేల్చనుంది.
నెం.1 కాదు ఐసీసీ ట్రోఫీ కావాలి
2019 వరకు రోహిత్‌ను టెస్టు ఆటగాడిగా పరిగణించలేదు. ఆ తర్వాతే సుదీర్ఘ ఫార్మాట్‌లో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో 1-2తో సిరీస్ ఓడాక కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రోహిత్‌కు పగ్గాలు అప్పజెప్పారు. దాంతో అన్ని ఫార్మాట్లలోనూ జట్టు నాయకుడిగా మారాడు. అయితే పూర్తి స్థాయి కెప్టెన్‌గా మారాక హిట్‌మ్యాన్‌ను గాయాలు వేధించాయి. దీంతో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లో ఆడి జట్టుకు సిరీస్‌ను అందించాడు. మరోవైపు రోహిత్ ద్వైపాక్షిక సిరీ్‌సల్లో భారత జట్టును విజయవంతంగా నడిపించాడు. ఎందుకంటే టీమిండియా ఇప్పుడు వన్డే, టీ20ల్లో నెంబర్‌వన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కానీ వరల్డ్‌క్‌పలు గెలవకుండా టాప్ ర్యాంక్‌లో కొనసాగితే ప్రయోజనమేంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రెండేళ్లలో మూడు టోర్నీల్లో జట్టు ఓటమిపాలైంది. 2013లో చివరిసారిగా జట్టు ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది.
మూడు ఫార్మాట్లలోనూ ప్రమాదమే..
వాస్తవానికి రోహిత్‌కు గాయాల బెడదతో పూర్తి స్థాయిలో టెస్టు జట్టును నడిపించే పరిస్థితి ఎదురుకాలేదు. విచిత్రమేమిటంటే.. రెగ్యులర్ కెప్టెన్‌గా మారిన ఏడాదిలోపే మూడు ఫార్మాట్లలోనూ అతడి నాయకత్వానికి ప్రమాద ఘంటికలు మోగుతుండడం గమనార్హం. అధికారికంగా ప్రకటించకపోయినా పొట్టి ఫార్మాట్‌లో రోహిత్‌ను ఇక కెప్టెన్‌గా చూడలేం. హార్దిక్ పాండ్యానే కొనసాగించే అవకాశం ఉంది. టీ20 వరల్డ్‌కప్ సెమీ్‌సలో ఓడినప్పటి నుంచి భారత్ ఆడిన టీ20 మ్యాచ్‌లన్నీ పాండ్యా నేతృత్వంలోనే జరిగాయి. ఇదే ఏడాది వన్డే వరల్డ్‌క్‌పలోనూ ఆడాల్సి ఉంది. ఈ మెగా టోర్నీ కూడా రోహిత్ కెప్టెన్సీకి సవాల్ విసరబోతోంది. ప్రస్తుతం ఆసీ్‌సతో టెస్టు సిరీస్ కూడా అతడికి కీలకమే.. ఈ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో జట్టును నడిపించబోతున్న హిట్‌మ్యాన్ చక్కటి వ్యూహంతో బరిలోకి దిగి ప్రత్యర్థిని కంగారెత్తించాలని ఆశిద్దాం.