DCvsMI: బ్యాటర్ లలిత్ యాదవ్‌పై డేవిడ్ వార్నర్ ఆగ్రహం.. ఎందుకో మీరే చూడండి..

ABN , First Publish Date - 2023-04-12T10:36:54+05:30 IST

ఈ సీజన్‌లో ఇప్పటివరకు గెలవని రెండు టీమ్‌ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌పై చివరి బంతికి ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది.

DCvsMI: బ్యాటర్ లలిత్ యాదవ్‌పై డేవిడ్ వార్నర్ ఆగ్రహం.. ఎందుకో మీరే చూడండి..

ఈ సీజన్‌లో (IPL 2023) ఇప్పటివరకు గెలవని రెండు టీమ్‌ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ (DC) టీమ్‌పై చివరి బంతికి ముంబై ఇండియన్స్ (MI) జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner)అర్ధశతకం సాధించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో తన సహ ఆటగాడు లలిత్ యాదవ్‌పై (Lalit Yadav) వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కామెరూన్ గ్రీన్ వేసిన 12వ ఓవర్ మూడు బంతికి వార్నర్ మిడ్-ఆఫ్ మీదుగా షాట్ కొట్టాడు. అది నేరుగా ఫీల్డర్ పియూష్ చావ్లా చేతుల్లోకి వెళ్లింది. అయితే పియూష్ ఆ క్యాచ్‌ను జారవిడిచాడు. అయితే బంతిని కొట్టగానే వార్నర్ పరుగు ప్రారంభించాడు. మరో ఎండ్‌లో ఉన్న లలిత్ మాత్రం వార్నర్ వైపు కాకుండా బంతి వైపు చూస్తూ ఉండిపోయాడు. అప్పటికే వార్నర్ సగం వరకు వచ్చి లలిత్‌ను అప్రమత్తం చేశాడు. దీంతో లలిత్ పరుగు పూర్తి చేశాడు. అనంతరం లలిత్‌పై వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు (Warner Angry on Lalit).

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది? నెల రోజుల్లో నాలుగోసారి గోల్డెన్ డక్.. ఫ్యాన్స్ విమర్శలు

ఈ మ్యాచ్‌లో (DCvsMI) కూడా వార్నర్ టీమ్ ఓటమిపాలైంది. ఢిల్లీ టీమ్‌పై రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇదే తొలి విజయం కాగా, ఢిల్లీకి వరుసగా ఇది నాలుగో ఓటమి. ఈ సీజన్‌లో ఢిల్లీ టీమ్ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.

Updated Date - 2023-04-12T10:36:54+05:30 IST