RCBvsPBKS: ప్రమాదకర లివింగ్‌స్టన్‌కు షాకిచ్చిన కోహ్లీ.. డీఆర్‌ఎస్‌లో వెలువడిన నిర్ణయంతో నవ్వు మాయం!

ABN , First Publish Date - 2023-04-21T10:41:50+05:30 IST

గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ లెవన్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అందరి కళ్లూ పంజాబ్ ఓపెనర్ లివింగ్‌స్టన్ మీదే ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ ప్రమాదకర బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతాడో చూడాలని అందరూ ఆసక్తి ప్రదర్శించారు.

RCBvsPBKS: ప్రమాదకర లివింగ్‌స్టన్‌కు షాకిచ్చిన కోహ్లీ.. డీఆర్‌ఎస్‌లో వెలువడిన నిర్ణయంతో నవ్వు మాయం!

గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ లెవన్ (PBKS) మధ్య జరిగిన ఐపీఎల్ (IPL 2023)మ్యాచ్‌లో అందరి కళ్లూ పంజాబ్ ఓపెనర్ లివింగ్‌స్టన్ (Liam Livingstone) మీదే ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ ప్రమాదకర బ్యాట్స్‌మెన్ ఎలా ఆడతాడో చూడాలని అందరూ ఆసక్తి ప్రదర్శించారు. అయితే రెండో బంతికే అవుటై లివింగ్‌స్టన్ అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు తన అవుట్ అయినట్టు రీప్లేలో తెలుసుకుని షాకయ్యాడు.

రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ కాలి నొప్పితో బాధపడడంతో బెంగళూరు టీమ్‌కు కోహ్లీ (Virat Kohli) నాయకత్వం వహించాడు. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు సిరాజ్ (Mohammed Siraj) షాకిచ్చాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్ రెండో బంతిని లివింగ్‌స్టన్ ముందుకు వచ్చి ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే కనెక్షన్ కుదరకపోవడంతో బంతి ప్యాడ్‌కు తగిలింది. దీంతో సిరాజ్ అప్పీల్ చేశాడు. అంపైర్ అవుట్ ఇవ్వలేదు. సిరాజ్ కాన్ఫిడెన్స్ చూసిన కెప్టెన్ కోహ్లీ డీఆర్‌ఎస్ (DRS) కోరాడు.

Virat Kohli: అందుకే బ్యాటింగ్ కష్టంగా మారింది.. టేబుల్‌ను బట్టి టీమ్‌ను అంచనా వేయకూడదు..

అది అవుట్ కాదని లివింగ్‌స్టన్ చాలా నమ్మకంగా ఉన్నాడు. పిచ్ మధ్యలో నవ్వుతూ నిల్చున్నాడు. అయితే సిరాజ్ విసిరిన బంతి వికెట్ల లైన్‌లో పడి లెగ్ వికెట్‌ను తగిలినట్టు బాల్ ట్రాకింగ్ విధానంలో తేలింది. దీంతో లివింగ్‌స్టన్ మొహంలో నవ్వు మాయమైంది. అంపైర్‌ అవుట్‌గా ప్రకటించడంతో లివింగ్‌స్టన్ నిరాశగా వెనుదిరిగాడు. కోహ్లీ తీసుకున్న బెస్ట్ డీఆర్‌ఎస్ నిర్ణయాల్లో ఇది ఒకటని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Updated Date - 2023-04-21T10:41:50+05:30 IST