Dhoni Six: 2011 ప్రపంచకప్‌ అందించిన ధోనీ సిక్స్‌ను మరచిపోగలమా? ఆ సిక్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏం చేస్తున్నారంటే..

ABN , First Publish Date - 2023-04-04T08:10:10+05:30 IST

2011 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన సిక్స్‌ను భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి చివరి వరకు క్రీజులో నిలిచి ధోనీ ఆ ఫైనల్ మ్యాచ్‌ను గెలిపించి కోట్లాది మంది అభిమానుల ఆశలను నెరవేర్చాడు.

Dhoni Six: 2011 ప్రపంచకప్‌ అందించిన ధోనీ సిక్స్‌ను మరచిపోగలమా? ఆ సిక్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏం చేస్తున్నారంటే..

2011 ప్రపంచకప్ (2011 World Cup) ఫైనల్లో టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కొట్టిన సిక్స్‌ను భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి చివరి వరకు క్రీజులో నిలిచిన ధోనీ ఆ ఫైనల్ మ్యాచ్‌ను సిక్స్‌తో గెలిపించి కోట్లాది మంది అభిమానుల ఆశలను నెరవేర్చాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో (Wankhede Stadium) శ్రీలకంతో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో ధోనీ కొట్టిన సిక్స్‌ను, ``Dhoni finishes off in style`` అంటూ రవిశాస్త్రి ఎంతో ఉద్వేగంతో చేసిన కామెంట్‌ను ఎవ్వరూ మర్చిపోలేరు (World Cup winning six).

ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోషియేషన్ (ఎమ్‌సీఏ) ఓ నిర్ణయం తీసుకుంది. ధోనీ సిక్స్ కొట్టిన తర్వాత బంతి వాంఖడే స్టేడియంలోని పెవిలియన్‌లో సరిగ్గా ఏ సీటు దగ్గర పడిందో అక్కడే ఓ ``విక్టరీ మెమోరియల్``ను (Vicrtoy Memorial) నిర్మించబోతోందట. ధోనీ సిక్స్ స్టైల్‌లో ఉన్న విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయబోతోందట. ఈ నెల 8వ తేదీన వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) మధ్య ఐపీఎల్ (IPL 2023)మ్యాచ్ జరగబోతోంది. ఆ మ్యాచ్ (CSK vs MI) సందర్భంగా ధోనీని ఎమ్‌సీఏ సన్మానించబోతోందట.

IPL 2023: ఈ ఐపీఎల్ సీజన్‌తో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో.. వేలంలో రూ. 13 కోట్లు పలికి 13 రన్స్ కొట్టిన మహానుభావుడు ఎవరంటే..

``ధోనీ కొట్టిన బంతి స్టేడియంలోని విఠల్ దవేచా పెవిలియన్‌లో పడింది. సరిగ్గా అక్కడే ఓ మెమోరియల్ నిర్మించాలని నిర్ణయించుకున్నాం. ధోనీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేం. ఎంతో మంది యువ క్రికెటర్లకు అదొక గొప్ప పాఠం. అందుకే దానిని చిరస్మరణీయం చేయాలనుకున్నామ``ని ఎమ్‌సీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలే అన్నారు.

Updated Date - 2023-04-04T08:10:12+05:30 IST