Meenakshi : రాష్ర్టీయ బాల పురస్కారానికి ఎంపికైన మీనాక్షి

ABN , First Publish Date - 2023-01-22T00:18:31+05:30 IST

చిరుప్రాయంలోనే చదరంగ క్రీడలో అద్భుతంగా రాణిస్తోన్న తెలుగమ్మాయి కొలగట్ల అలన మీనాక్షి ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2023కి

Meenakshi : రాష్ర్టీయ బాల పురస్కారానికి ఎంపికైన మీనాక్షి

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): చిరుప్రాయంలోనే చదరంగ క్రీడలో అద్భుతంగా రాణిస్తోన్న తెలుగమ్మాయి కొలగట్ల అలన మీనాక్షి ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2023కి ఎంపికైంది. ఈనెల 23న ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును మీనాక్షి అందుకోనుంది. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతిఏటా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న చిన్నారులను ఎంపికచేసి ప్రధానమంత్రి బాల పురస్కార్‌ అవార్డులను అందజేస్తుంది. క్రీడారంగం తరఫున వైజాగ్‌కు చెందిన 11 ఏళ్ల మీనాక్షి ఎంపికైంది. ఇటీవలే మహిళల ఫిడే మాస్టర్‌ టైటిల్‌ అందుకున్న మీనాక్షి.. ప్రస్తుతం ప్రపంచ అండర్‌-12 చెస్‌ బాలికల విభాగంలో నెంబర్‌వన్‌ ర్యాంకులో ఉండడం విశేషం.

Updated Date - 2023-01-22T00:18:37+05:30 IST