MS Dhoni: ధోనీకి వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే.. వికెట్ల వెనుక నుంచి ఎలా రనౌట్ చేశాడో చూడండి..
ABN , First Publish Date - 2023-04-28T08:16:53+05:30 IST
కొంత మందికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. వయసు పెరుగుతున్నా వారిలో ఎలాంటి మార్పులూ కనిపించవు. 41 ఏళ్ల ధోనీ ప్రస్తుత ఐపీఎల్‌లో తన అద్భుత వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు.
కొంత మందికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. వయసు పెరుగుతున్నా వారిలో ఎలాంటి మార్పులూ కనిపించవు. 41 ఏళ్ల ధోనీ (MS Dhoni) ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) తన అద్భుత వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుంటున్నాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉంటూ సత్తా చాటుతున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్లలో ధోనీ ఒకడు. అయితే మిగిలిన వారు వయసు మళ్లాక ధోనీ స్థాయిలో కీపింగ్ చేశారా? అంటే చెప్పడం కష్టం. కానీ ధోనీ మాత్రం కెరీర్ చివరి దశలో కూడా అద్భుతంగా కీపింగ్ చేస్తున్నాడు.
గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల (CSKvsRR) మధ్య జైపూర్‌లో (Jaipur) మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ఆఖరి ఓవర్లో పతిరినా వేసిన నాలుగో బాల్ వైడ్ వెళ్లింది. దీంతో నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న జురైల్ పరుగు ప్రారంభించాడు. పడిక్కల్ కూడా పరిగెత్తాడు. వెంటనే బాల్ అందుకున్న ధోనీ గ్లౌస్ కూడా తీయకుండా అద్భుతంగా రనౌట్ చేశాడు (MS Dhoni Hit The Bullseye). దీంతో సూపర్ ఫామ్‌లో ఉన్న జురెల్ (Dhruv Jurel) పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Sara Tendulkar: శుభ్‌మన్ గిల్ vs అర్జున్ టెండూల్కర్, సారా సపోర్ట్ ఎవరికి? నెటిజన్ల ఫన్నీ మీమ్స్!
అది అవుటా, కాదా? అనే విషయంలో అంపైర్.. థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు. అయితే తను అవుట్ అయ్యాననే విషయం జురెల్‌కు స్పష్టంగా తెలుసు కాబట్టి నిర్ణయం వెలువడకుండానే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ధోనీ ఫీల్డింగ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోనీ లాంటి కీపర్ మళ్లీ టీమిండియాకు దొరకడని కామెంట్లు చేస్తున్నారు.