Prabhsimran Singh: ప్రభ్‌సిమ్రన్ సూపర్ సెంచరీ.. ఒంటరి పోరాటంతో పంజాబ్‌ను గెలిపించిన ఓపెనర్!
ABN , First Publish Date - 2023-05-14T11:36:43+05:30 IST
ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు స్టార్లుగా ఎదుగుతున్నారు. ఈ లీగ్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్తు స్టార్లుగా ఎదుగుతున్నారు. ఈ లీగ్‌లో (IPL 2023) యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే. తాజాగా 22 ఏళ్ల ప్రభ్‌సిమ్రన్ సింగ్ (Prabhsimran Singh) కూడా మెరిశాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (PBKSvsDC)శతకం సాధించాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇది ఐదో సెంచరీ కావడం విశేషం.
ఓపెనర్‌గా బరిలోకి ప్రభ్‌సిమ్రన్ 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 61 బంతుల్లోనే సెంచరీ చేశాడు. సహచర ఆటగాళ్లు వెనుదిరుగుతున్నా ప్రభ్‌సిమ్రన్ మాత్రం క్రీజులో పాతుకుపోయి ఒంటరి పోరాటం చేశాడు. ప్రభ్‌సిమ్రన్ కారణంగానే ఢిల్లీ టీమ్ ఫైటింగ్ టోటల్ సాధించగలిగింది. నిర్ణీత 20 ఓవర్లో 167 పరుగులు చేసింది. అందులో ప్రభ్‌సిమ్రన్ చేసినవి 103 పరుగులు. వికెట్లు పడుతున్నా ప్రభ్‌సిమ్రన్ దూకుడు మాత్రం తగ్గించలేదు. కుల్దీప్, దూబే ఓవర్లలో భారీ సిక్సర్లు బాదాడు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
Ishant Sharma: ఢిల్లీ ఫట్.. ఇషాంత్ శర్మ హిట్.. ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించిన వార్నర్ సేన!
ఛేజింగ్‌ను ఢిల్లీ (DC) ఓపెనర్లు ధాటిగానే ఆరంభించారు. తొలి ఆరు ఓవర్లలోనే ఢిల్లీ స్కోరు 65 పరుగులను దాటించారు. ఓపెనర్లు వార్నర్ (David Warner), సాల్ట్ (21) బౌండరీలతో హోరెత్తించారు. ఈ దశలో హైదరాబాద్ సునాయాసంగా మ్యాచ్‌ను ముగిస్తుందని అంతా భావించారు. కానీ పంజాబ్ బౌలర్లు పవర్‌ప్లే ముగిశాక తడాఖా చూపారు. ముఖ్యంగా అటు హర్‌ప్రీత్ బ్రార్.. ఇటు రాహల్ చాహర్ డీసీని ఏమాత్రం కుదురుకోనీయలేదు. హర్‌ప్రీత్ తన వరుస ఓవర్లలో సాల్ట్, రొసో (5)తో పాటు 23 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసి జోరు మీదున్న వార్నర్‌ను, మనీశ్ పాండే (0)లను అవుట్ చేయడంతో డీసీ ఇక కోలేకోలేకపోయింది.