Pragnananda: తొలి గేమ్‌ సమంగా..

ABN , First Publish Date - 2023-08-23T02:50:09+05:30 IST

చెస్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు.

Pragnananda: తొలి గేమ్‌ సమంగా..

ప్రజ్ఞానంద-కార్ల్‌సన్‌ గేమ్‌ డ్రా

చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌

బాకు: చెస్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు. మంగళవారం ప్రపంచ నెంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో జరిగిన ఈ క్లాసికల్‌ గేమ్‌ 35 ఎత్తుల వద్ద ఫలితం తేలకుండానే ముగిసింది. బుధవారం రెండో గేమ్‌ జరుగుతుంది. ఈ గేమ్‌లో గెలిచిన విజేత చాంపియన్‌గా నిలుస్తాడు. ఒకవేళ ఈ గేమ్‌ కూడా డ్రాగా ముగిస్తే టైబ్రేకర్‌ అనివార్యమవుతుంది. తెల్ల పావులతో ఆట ఆరంభించిన 18 ఏళ్ల ప్రజ్ఞానందను కార్ల్‌సన్‌ ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 35 ఎత్తుల వద్ద ఇరువురు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. అయితే రెండో గేమ్‌లో మాగ్నస్‌ తెల్ల పావులతో ఆట ఆరంభించనుండడం అతనికి అడ్వాంటేజ్‌ కానుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో ప్రవేశించిన రెండో ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-08-23T02:50:09+05:30 IST