Share News

ప్రణయ్‌ పునరాగమనం..

ABN , First Publish Date - 2023-11-14T03:13:47+05:30 IST

భారత నెం. 1 షట్లర్‌ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ గాయంతో నాలుగు వారాల విరామానంతరం పునరాగమనం చేస్తున్నాడు...

ప్రణయ్‌ పునరాగమనం..

నేటినుంచి జపాన్‌ మాస్టర్స్‌

బరిలో సింధు, లక్ష్య, శ్రీకాంత్‌

కుమామోటో (జపాన్‌): భారత నెం. 1 షట్లర్‌ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ గాయంతో నాలుగు వారాల విరామానంతరం పునరాగమనం చేస్తున్నాడు. మంగళవారం ఇక్కడ ప్రారంభమయ్యే జపాన్‌ మాస్టర్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అలాగే లక్ష్యసేన్‌, కిడాంబి శ్రీకాంత్‌ కూడా ఈ టోర్నీతో ఫామ్‌ దొరకబుచ్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. లీ యు (హాంకాంగ్‌)తో ప్రణయ్‌ తొలి రౌండ్‌ను ఆరంభిస్తుండగా, స్థానిక ఫేవరెట్‌ కొడాయ్‌ నరోకాతో సేన్‌, క్వాలిఫయర్‌తో కిడాంబి తలపడనున్నారు. మహిళల సింగిల్స్‌లో..పీవీ సింధు డెన్మార్క్‌కు చెందిన బిచ్‌ఫెల్ట్‌ను ఢీకొననుంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌/చిరాగ్‌ ద్వయం కూడా టోర్నీలో ఆడుతోంది.

Updated Date - 2023-11-14T03:13:58+05:30 IST