RajasthanVs Lucknow: టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్.. ఏం ఎంచుకున్నాడంటే...
ABN , First Publish Date - 2023-04-19T19:21:16+05:30 IST
ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో టాప్-2 జట్లు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Rajasthan Royals vs Lucknow Super Giants) మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది...
జైపూర్: ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో టాప్-2 జట్లు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (Rajasthan Royals vs Lucknow Super Giants) మధ్య ఆసక్తికర పోరుకు తెరలేచింది. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆడం జంపా స్థానంలో జాసన్‌ను జట్టులోకి తీసుకున్నట్టు చెప్పారు. కాగా ఈ పిచ్‌పై బంతి అంతగా బౌన్స్ అయ్యే అవకాశం లేదు. టర్న్ కూడా పెద్దగా లభించే అవకాశంలేదు. అయితే మొదటి అర్ధభాగంలో స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉండొచ్చని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే టాస్ గెలిచిన సంజూ శాంసన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
తుది జట్లు...
రాజస్థాన్ రాయల్స్: జాస్ బట్లర్, యశశ్వి జైస్వాల్, సంజూ శాంసన్(వికెట్ కీపర్/కెప్టెన్), రియాగ్ పరాగ్, హిట్మేయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్.
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికొలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, ఆవేశ్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరాక్, రవి బిష్ణోయ్.