వాంఖడేలో సచిన్ విగ్రహం
ABN , First Publish Date - 2023-11-02T04:06:37+05:30 IST
దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో మహారాష్ట్ర ముఖ్యమంతి ఏక్‌నాథ్ షిండే బుధవారం ఆవిష్కరించారు...
ఆవిష్కరించిన మహారాష్ట్ర సీఎం షిండే
ముంబై: దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో మహారాష్ట్ర ముఖ్యమంతి ఏక్‌నాథ్ షిండే బుధవారం ఆవిష్కరించారు. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమానికి సచిన్, అతడి భార్య అంజలి, కూతురు సారాతో హాజరయ్యాడు. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవిస్, బీసీసీఐ, ఐసీసీ మాజీ చీఫ్ శరద్ పవార్, బీసీసీఐ కార్యదర్శి జై షా, కోశాధికారి అశీష్ షెలార్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా పాల్గొన్నారు. ‘ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజు. ముంబై క్రికెట్ సంఘం బాధ్యులు విగ్రహం ఏర్పాటు విషయం చెప్పగానే నాకు సంతోషం వేసింది. ఎంతో గౌరవంగానూ భావించా’ అని సచిన్ అన్నాడు.