Sami :వెస్టిండీస్ కోచ్‌గా సామి
ABN , First Publish Date - 2023-05-13T04:51:23+05:30 IST
వెస్టిండీస్ పురుషుల వన్డే, టీ20 జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్ డారెన్ సామి నియమితుడయ్యాడు. అలాగే
సెయింట్‌జాన్స్ (ఆంటిగ్వా) : వెస్టిండీస్ పురుషుల వన్డే, టీ20 జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్ డారెన్ సామి నియమితుడయ్యాడు. అలాగే టెస్ట్, ‘ఎ’ జట్ల కోచ్‌గా మరో మాజీ ఆటగాడు ఆండ్రూ కోలీని నియమించినట్టు క్రికెట్ వెస్టిండీస్ శుక్రవారం ప్రకటించింది. జూన్‌లో యూఏఈతో జరిగే మూడు వన్డేల సిరీస్‌నుంచి సామి బాధ్యతలు చేపడతాడు. ఇక జూలైలో స్వదేశంలో భారత్‌తో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్ నుంచి కోలీ బాధ్యతలు నిర్వర్తిస్తాడు.