Gujarat Vs Hyderabad: సెంచరీతో చెలరేగిన గిల్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..

ABN , First Publish Date - 2023-05-15T21:39:32+05:30 IST

సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans) ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో (101) చెలరేగాడు.

Gujarat Vs Hyderabad: సెంచరీతో చెలరేగిన గిల్.. సన్‌రైజర్స్ టార్గెట్ ఎంతంటే..

అహ్మదాబాద్: సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ (Gujarat Titans) ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో (101) చెలరేగాడు. గిల్‌కు తోడు సాయి సుదర్శన్ (47) రాణించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు (Sunrisers Hyderabad) గుజరాత్ ఛాలెంజింగ్ టార్గెట్ విసిరింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 నష్టానికి 188 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్‌ టార్గెట్ 189 పరుగులుగా ఉంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో గిల్ (101), సాయి సుదర్శన్ (47) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ రాణించలేకపోయారు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (0), శుభ్‌మన్ గిల్ (101), సాయి సుదర్శన్ (47), హార్ధిక్ పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3), దసున్ శణక (9 నాటౌట్), రషీద్ ఖాన్ (0), నూర్ అహ్మద్ (0), మహ్మద్ షమీ (0), మొహిత్ శర్మ (0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.

కాగా ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లు రాణించారు. ముఖ్యంగా పేసర్ భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లతో రాణించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకంగా 4 వికెట్లు పడడం విశేషం. భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్ల ఔటయిన వారందరూ డకౌట్‌గా వెనుదిరిగాడు. కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక మార్కో జెన్‌సెన్, ఫారూకీ, నటరాజన్ తలో వికెట్ తీశారు.

Updated Date - 2023-05-15T21:42:54+05:30 IST