స్వీడన్‌ ‘కిక్‌’..అమెరికా అవుట్‌

ABN , First Publish Date - 2023-08-07T02:02:04+05:30 IST

డిఫెండింగ్‌ చాంపియన్‌ అమెరికాకు పెనాల్టీ షూటౌట్‌లో 5-4తో షాకిచ్చిన స్వీడన్‌ మహిళల ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది.....

స్వీడన్‌ ‘కిక్‌’..అమెరికా అవుట్‌

సౌతాఫ్రికాపై నెదర్లాండ్స్‌ గెలుపు

మహిళల వరల్డ్‌ కప్‌ సాకర్‌

మెల్‌బోర్న్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ అమెరికాకు పెనాల్టీ షూటౌట్‌లో 5-4తో షాకిచ్చిన స్వీడన్‌ మహిళల ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ఆదివారం హోరాహోరీగా జరిగిన ఈ రౌండ్‌-16 మ్యాచ్‌లో నిర్ణీత, అదనపు సమయాల్లో గోల్‌ చేయడంలో ఇరు జట్లు విఫలమయ్యాయి. దాంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఇది కూడా ఉత్కంఠ పరిస్థితుల నడుమ సాగి 4-4తో సమం కావడంతో టెన్షన్‌ హైపిచ్‌కు చేరింది. ఈ క్రమంలో ఒత్తిడిని అధిగమించి స్వీడన్‌ అటాకర్‌ లినా హర్టిగ్‌ చేసిన గోల్‌తో స్వీడన్‌ అద్భుత విజయం సాధించింది. ఇక స్వీడన్‌ జట్టు క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌తో తలపడనుంది. మరో ప్రీక్వార్టర్‌ఫైనల్లో సౌతాఫ్రికాపై 2-0తో నెగ్గిన నెదర్లాండ్స్‌ స్పెయిన్‌తో తదుపరి పోరుకు సిద్ధమైంది.

Updated Date - 2023-08-07T02:02:04+05:30 IST