VVS Laxman : టీమిండియా కాబోయే కోచ్‌ లక్ష్మణ్‌?

ABN , First Publish Date - 2023-01-03T00:22:53+05:30 IST

టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం వన్డే వరల్డ్‌ కప్‌ అనంతరం ముగియనుంది. ఒకవేళ ద్రవిడ్‌ పొడిగింపును కోరుకోకుంటే..

VVS Laxman : టీమిండియా కాబోయే కోచ్‌ లక్ష్మణ్‌?

న్యూఢిల్లీ: టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం వన్డే వరల్డ్‌ కప్‌ అనంతరం ముగియనుంది. ఒకవేళ ద్రవిడ్‌ పొడిగింపును కోరుకోకుంటే.. ఈ నవంబరులో మెగా టోర్నమెంట్‌ పూర్తయ్యాక అతడి స్థానంలో ప్రధాన కోచ్‌ ఎవరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను ద్రవిడ్‌ స్థానంలో నియమించాలని ఆదివారం జరిగిన సమీక్షా సమావేశంలో తీర్మానించినట్టు సమాచారం. ద్రవిడ్‌ కరోనా బారిన పడడంతో 2022 ఆసియా కప్‌నకు 48 ఏళ్ల లక్ష్మణ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే పలు ద్వైపాక్షిక సిరీ్‌సలకూ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా.. టీ20లకు హార్దిక్‌ను కెప్టెన్‌గా నియమించిన నేపథ్యంలో..ఆ జట్టుకు ప్రత్యేకంగా కోచ్‌ను నియమించాలని కూడా బీసీసీఐ భావిస్తోంది.

Updated Date - 2023-01-03T00:22:54+05:30 IST