Arjun Chess World Cup: ప్రజ్ఞానందపై అర్జున్ గెలుపు
ABN , First Publish Date - 2023-08-16T04:05:42+05:30 IST
చెస్ వరల్డ్‌కప్‌లో తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి జోరు కొనసాగిసున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో అర్జున్.. సహచర గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందపై గెలిచాడు.
చెస్ వరల్డ్‌కప్
బాక్ (అజర్‌బైజాన్): చెస్ వరల్డ్‌కప్‌లో తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి జోరు కొనసాగిసున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌లో అర్జున్.. సహచర గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందపై గెలిచాడు. నల్లపావులతో ఆడిన ఇరిగేసి 53 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించాడు. దీంతో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన అర్జున్.. బుధవారం జరిగే రెండో గేమ్‌ను డ్రా చేసుకొన్నా..సెమీస్‌కు చేరుకొంటాడు. కాగా, నిజాత్ అబసోవ్ (అజర్‌బైజాన్)తో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన విదిత్ గుజరాతీ 109 ఎత్తుల అనంతరం డ్రాకు అంగీకరించాడు. మాగ్నస్ కార్ల్‌సన్‌తో జరిగిన తొలి గేమ్‌లో గుకేష్ ఓటమి పాలయ్యాడు. తెల్లపావులతో ఆడిన గుకేష్ 48 ఎత్తుల అనంతరం కార్ల్‌సన్ ముందు ఓటమి అంగీకరించాడు. గుకేష్ ఆశలు సజీవంగా నిలవాలంటే రెండో గేమ్‌లో తప్పక నెగ్గాల్సిందే. అమెరికా గ్రాండ్ మాస్టర్లు ఫాబినో కరువానా, లీనర్ పెరీజ్ మధ్య గేమ్ కూడా డ్రాగా ముగిసింది.