Virat Kohli: అందుకే బ్యాటింగ్ కష్టంగా మారింది.. టేబుల్‌ను బట్టి టీమ్‌ను అంచనా వేయకూడదు..
ABN , First Publish Date - 2023-04-21T10:16:09+05:30 IST
ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లతో ఈ ఐపీఎల్ చాలా ఆసక్తికరంగా మారింది. అన్ని జట్లూ అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతున్నాయి. గురువారం సాయంత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఉత్కంఠ కలిగించే మ్యాచ్‌లతో ఈ ఐపీఎల్ (IPL 2023) చాలా ఆసక్తికరంగా మారింది. అన్ని జట్లూ అద్భుతంగా రాణిస్తూ సత్తా చాటుతున్నాయి. గురువారం సాయంత్రం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ (PBKSvsRCB) జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అత్యద్భుత గణాంకాలను నమోదు చేశాడు. 4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది లీగ్‌లో అత్యుత్తమ వ్యక్తిగత గణాంకాలు నమోదు చేసిన సిరాజ్ ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా ఎంపికయ్యాడు.
ముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్‌కు కోహ్లీ (Virat Kohli) (59), డుప్లెసీ (84) మెరుపు ఆరంభాన్ని అందించడంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. ఓపెనింగ్ జంట చక్కగా రాణించడంతో ఈ మ్యాచ్‌లో బెంగళూరు టీమ్ సులభంగా 200 పరుగులు చేస్తుందనిపించింది. అయితే 10 ఓవర్ల తర్వాత పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 150కి ఆలౌట్ అయి 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం పిచ్ గురించి కోహ్లీ మాట్లాడాడు.
IPL 2023: దాదాపు రెండేళ్ల తర్వాత బరిలోకి దిగిన ఇషాంత్.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటి ఘనంగా పునరాగమనం!
``మేం మరో 20, 30 పరుగులు అదనంగా చేయాల్సింది. కానీ, పిచ్ అనూహ్యంగా ప్రవర్తించింది. పిచ్ చాలా పొడిగా ఉంది. పిచ్‌పై తగినంత తేమ లేదు. బ్యాక్‌ఫుట్ మీద సిక్స్‌లు ఎవరూ కొట్టలేకపోయారు. పిచ్ ప్రవర్తనను చూసి బౌలింగ్‌పై ఓ అంచనాకు వచ్చాం. సిరాజ్ అద్భుతంగా రాణించాడు. మా టీమ్ ఈ సీజన్‌లో మెరుగ్గా రాణిస్తోంది. పాయింట్ల పట్టికలో స్థానం చూసి ఓ టీమ్‌ను అంచనా వేయకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో విజయాలు సాధిస్తున్నామనేది కూడా ముఖ్యం. డుప్లెసీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడ``ని కోహ్లీ అన్నాడు.