Dhoni: గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఎక్కడ తేడా కొట్టిందంటే.. ధోనీ చెప్పిందిది..!

ABN , First Publish Date - 2023-04-01T09:03:57+05:30 IST

ఐపీఎల్-2023 (IPL 2023) శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్కంఠగా జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు 5 వికెట్లతో విజయం సాధించింది.

Dhoni: గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో ఎక్కడ తేడా కొట్టిందంటే.. ధోనీ చెప్పిందిది..!

ఐపీఎల్-2023 (IPL 2023) శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్కంఠగా జరిగిన తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టు 5 వికెట్లతో విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన ధోనీ సేన 178 పరుగుల భారీ స్కోరు చేసినా విజయం దక్కించుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో అసలు తప్పెక్కడ జరిగిందో ధోనీ (Dhoni) వివరణ ఇచ్చాడు. మిడిలార్డర్ బ్యాటింగ్ వైఫల్యం తమను దెబ్బకొట్టిందని చెప్పాడు.

``రుతురాజ్ (Ruturaj Gaikwad) అద్భుతంగా ఆడాడు. అయితే మిడిల్ ఓవర్లలో మేం మరిన్ని పరుగులు చేయాల్సింది. రుతురాజ్ ఆడుతున్న విధానం చూస్తే మేం సులభంగా 200 పరుగులు చేయగలమనిపించింది. కానీ, అలా జరగలేదు. మిడిలార్డర్‌ మరింత బాధ్యతగా ఆడి ఉండాల్సింది. రాజ్‌వర్ధన్ హంగర్గేకర్‌ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్ల పడగొట్టాడు. అతడి పేస్ బాగుంది. అతడు కచ్చితంగా భారత జట్టుకు ఆడతాడు. ఇద్దరు లెఫ్టార్మ్ బౌలర్లతో ఆడాలని ముందుగానే నిర్ణయించుకున్నామ``ని ధోనీ చెప్పాడు.

IPL 2023: రుతురాజ్ సెంచరీని అడ్డుకున్న కొత్త రూల్.. ఎలా ఔట్ అయ్యాడో చూడండి.. చెన్నై ఫ్యాన్స్ ఫైర్..

మరోవైపు తమ ఆటగాళ్ల ప్రదర్శనపై పాండ్యా (Hardik Pandya) సంతృప్తి వ్యక్తం చేశాడు. అత్యంత క్లిష్టమైన దశలో రాహుల్, రషీద్ (Rashid) ఆడిన విధానాన్ని ప్రశంసించాడు. ``చెన్నై కచ్చితంగా 200 పరుగులు చేస్తుందని అనుకున్నాం. కానీ, మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి స్కోరును నియంత్రించారు. నిజంగా రషీద్ లాంటి ఆల్‌రౌండర్ ఉండడం జట్టుకు గొప్ప ఆస్తి`` అని పాండ్యా అన్నాడు.

Updated Date - 2023-04-01T09:03:57+05:30 IST