India-Sri Lanka 3rd T20 : సిరీస్ ఎవరిదో!
ABN , First Publish Date - 2023-01-07T00:32:25+05:30 IST
మూడు టీ20ల సిరీ్‌సలో ఆఖరి మ్యాచ్‌కు వేళైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్-శ్రీలంక మధ్య నువ్వా నేనా అనే రీతిలో సాగిన పోటీ అభిమానులకు మజా పంచింది. చివరకు చెరో మ్యాచ్ గెలుచుకోవడంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో
నిర్ణాయక పోరులో శ్రీలంకతో భారత్ ఢీ
నేడు చివరి టీ20
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
రాజ్‌కోట్: మూడు టీ20ల సిరీ్‌సలో ఆఖరి మ్యాచ్‌కు వేళైంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్-శ్రీలంక మధ్య నువ్వా నేనా అనే రీతిలో సాగిన పోటీ అభిమానులకు మజా పంచింది. చివరకు చెరో మ్యాచ్ గెలుచుకోవడంతో ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమమైంది. ఇక శనివారం జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టే సిరీస్ విజేత. భారత గడ్డపై శ్రీలంక గతంలో ఐదు టీ20 సిరీ్‌సలు ఆడినా ఒక్కటీ నెగ్గలేదు. అలాగే ఇక్కడ ఓ మ్యాచ్ గెలిచేందుకు ఏడేళ్లు పట్టగా..ఇప్పుడు ఏకంగా తొలిసిరీ్‌సను దక్కించుకునేందుకు లంకకిది మంచి అవకాశం. అటు పెద్దగా అనుభవం లేని యువ భారత్ జట్టు లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. 2019లో చివరిసారి టీమిండియా స్వదేశంలో ఆసీ్‌సకు సిరీస్ కోల్పోయింది. తర్వాత వరుసగా 11 సిరీ్‌సలు గెలిచింది. ఈ జైత్రయాత్రకు ఇప్పుడు లంక రూపంలో ప్రమాదం పొంచి ఉంది.
‘టాప్’ రాణిస్తేనే..: తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి గెలిచిన హార్దిక్ సేన.. ఆ తర్వాత మ్యాచ్‌లో ఆరంభం సరిగా లేక చివర్లో దెబ్బతింది. ముఖ్యంగా పుణె మ్యాచ్‌లో టాపార్డర్ వైఫల్యం.. పసలేని బౌలింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. యువ పేసర్ల నిలకడలేమి జట్టును దెబ్బతీస్తోంది. లైన్ అండ్ లెంగ్త్‌ను విస్మరిస్తూ లంక బ్యాటర్లకు చాన్సిచ్చారు. ముఖ్యంగా రెండే ఓవర్లు వేసిన అర్ష్‌దీప్ 5 నోబాల్స్‌తో పూర్తిగా నిరాశపరిచాడు. ఆరు నెలల క్రితం అరంగేట్రం చేసిన అతను యువ టీమ్ పేస్ బాధ్యతలు తీసుకుంటాడని భావించారు. అయితే ఈ కీలక మ్యాచ్‌లో అతడిని కొనసాగిస్తారా? లేక హర్షల్‌ను ఆడిస్తారా? చూడాలి. శివమ్, ఉమ్రాన్‌లకు ఇలాంటి సిరీ్‌సలు మంచి అనుభవంగా ఉపయోగపడగలవు. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ గిల్ తనకు దక్కిన రెండు అవకాశాలను వృధా చేసుకున్నాడు. అటు తొలి మ్యాచ్ ఆడిన రాహుల్ త్రిపాఠి పేలవ షాట్‌తో వెనుదిరిగాడు. ఈ సిరీ్‌సలో టాపార్డర్ ఇంకా సత్తా చూపనేలేదు. అక్షర్, సూర్యకుమార్ ఆ మాత్రమైనా ఆడకపోయుంటే పుణెలో ఫలితం మరింత అవమానకరంగా ఉండేది. రోహిత్, కోహ్లీ లేని జట్టు మరింత పటిష్టంగా తయారవ్వాలంటే బ్యాటింగ్‌ను గణనీయంగా మార్చుకోవాల్సి ఉంది.
జోష్‌లో లంక: ఇటీవలి కాలంలో షనక ఆధ్వర్యంలోని శ్రీలంక ప్రత్యర్థి జట్లకు సవాల్ విసురుతోంది. యువ ఆటగాళ్లలో గెలవాలనే కసి కనిపిస్తోంది. ఈ ఫార్మాట్‌లో ఎలా ఆడాలనే వ్యూహం ప్రకారం వారు ముందుకు వెళుతున్నారు. వాంఖడే మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు వారి పోరాటం ఫలితాన్నివ్వకపోయినా.. పుణెలో మాత్రం ఎదురుదాడికి దిగారు. ఇన్నింగ్స్ తొలిభాగం మెండిస్ క్రీజులో పాతుకుపోగా.. చివర్లో కెప్టెన్ షనక బాధ్యత తీసుకున్నాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి ఆదిలోనే వికెట్లు తీయడంతో భారత్ ఎంత ప్రయత్నించినా గెలవలేకపోయింది. ముఖ్యంగా షనక జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. భారత్‌పై అతడి చివరి ఐదు ఇన్నింగ్స్‌లో 56 నాటౌట్, 45, 33 నాటౌట్, 74 నాటౌట్, 47 నాటౌట్‌తో అదరగొట్టాడు. దీనికితోడు ఓపెనర్లు నిస్సాంక, మెండిస్ ఈసారీ శుభారంభాన్నిస్తే భారీస్కోరు ఖాయమే. ఈ మ్యాచ్‌లోనూ లంక జట్టు పట్టు వదలని ఆటతీరును ప్రదర్శిస్తే మాత్రం భారత్‌కు సిరీస్ పరాజయం తప్పదు.
జట్లు (అంచనా)
భారత్: ఇషాన్, గిల్, సూర్యకుమార్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ (కెప్టెన్), హుడా, అక్షర్, మావి, ఉమ్రాన్, అర్ష్‌దీ్‌ప/హర్షల్, చాహల్.
శ్రీలంక: నిస్సాంక, కుశాల్, ధనంజయ, అసలంక, రాజపక్స/సమరవిక్రమ, షనక(కెప్టెన్), హసరంగ, కరుణరత్నె, తీక్షణ, రజిత, మధుశంక.
పిచ్
రాజ్‌కోట్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామంగా ఉం టుంది. ఏ ఫార్మాట్‌లో అయినా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయి. ఇక్కడ ఆడిన నాలుగు టీ20ల్లో రెండు చేజింగ్‌లో, రెండు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపవచ్చు.