పాండ్యా కనిపించేది ఐపీఎల్‌లోనేనా?
ABN , First Publish Date - 2023-11-23T03:33:30+05:30 IST
భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. గాయం కారణంగా వరల్డ్‌కప్ నుంచి అవుటైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరికొన్ని నెలలపాటు జట్టుకు దూరం కానున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. గాయం కారణంగా వరల్డ్‌కప్ నుంచి అవుటైన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరికొన్ని నెలలపాటు జట్టుకు దూరం కానున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. వచ్చే నెలలో జరిగే దక్షిణాఫ్రికా టూర్‌కు పాండ్యా అందుబాటులో ఉంటాడని భావించారు. కానీ, అతడు ఇప్పట్లో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించే అవకాశాల్లేవని తెలుస్తోంది. హార్దిక్ మళ్లీ ఐపీఎల్‌కే అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాల సమాచారం. బంగ్లాదేశ్‌తో వరల్డ్‌కప్ మ్యాచ్‌లో హార్దిక్ గాయపడిన సంగతి తెలిసిందే.
లఖ్‌నవూకు పడిక్కల్: ఐపీఎల్ జట్లు రాజస్థాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ పరస్పరం ఆటగాళ్లను ట్రేడ్ చేసుకొన్నాయి. పేసర్ అవేశ్ ఖాన్‌ను రాజస్థాన్‌కు అమ్మేసిన లఖ్‌నవూ.. బదులుగా ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్‌ను కొనుగోలు చేసింది. వేలంలో అవేశ్‌ను జెయింట్స్ రూ. 10 కోట్లకు కొనుగోలు చేయగా.. పడిక్కల్‌ను రాయల్స్ రూ. 7.75 కోట్లకు దక్కించుకొంది. ఫ్రాంచైజీలు పరస్పరం ట్రేడ్ చేసుకొన్నా వేలం ప్రకారమే వీరికి ఫీజులు చెల్లించనున్నాయి. కాగా, ఫామ్ కోల్పోయిన సర్ఫరాజ్ ఖాన్, మనీష్ పాండేలను ఢిల్లీ కేపిటల్స్ విడుదల చేసింది.