Women's Football World Cup : మహిళల పుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీ భారీగా పెంపు

ABN , First Publish Date - 2023-03-17T05:30:22+05:30 IST

మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. ఈ ఏడాది జరిగే మెగా టోర్నీ ప్రైజ్‌పూల్‌ 300 శాతం పెరిగి రూ. 1241 కోట్లకు చేరుకొంది.

Women's Football World Cup : మహిళల పుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీ భారీగా పెంపు

వాషింగ్టన్‌: మహిళల ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. ఈ ఏడాది జరిగే మెగా టోర్నీ ప్రైజ్‌పూల్‌ 300 శాతం పెరిగి రూ. 1241 కోట్లకు చేరుకొంది. 2015 ఈవెంట్‌తో పోల్చితే ఇది 10 రెట్లు అధికం. 2027 వరల్డ్‌కప్‌ సమయానికి పురుషులు, మహిళలకు సమాన ప్రైజ్‌మనీ ఇచ్చేలా చర్యలు తీసుకొంటామని మళ్లీ ఎన్నికైన ఫిఫా అధ్యక్షుడు జియానో ఇన్‌ఫాంటినో తెలిపాడు. కాగా, ఈ ఏడాది జూలైలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ సంయుక్తంగా నిర్వహించనున్న టోర్నీలో 32 జట్లు పాల్గొంటున్నాయి. అయితే, పురుషుల వరల్డ్‌క్‌పతో పోల్చితే మహిళల ఈవెంట్‌ ప్రసార హక్కుల కోసం బ్రాడ్‌కాస్టర్లు వంద శాతం తక్కువకు బిడ్‌లు వేయడంపై ఇన్‌ఫాంటినో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలా చేస్తే ప్రసార హక్కులకు అమ్మబోమని చెప్పాడు.

Updated Date - 2023-03-17T05:30:22+05:30 IST