సురేఖ @ 4

ABN , First Publish Date - 2023-04-26T01:40:37+05:30 IST

ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో వి. జ్యోతి సురేఖ తిరిగి టాప్‌-5లోకి చేరుకుంది.

సురేఖ @ 4

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో వి. జ్యోతి సురేఖ తిరిగి టాప్‌-5లోకి చేరుకుంది. ఇటీవల ముగిసిన ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-1 కాంపౌండ్‌ కేటగిరీలో రెండు స్వర్ణాలు సాధించిన సురేఖ, వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో 11 నుంచి నాలుగో స్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌ ఆర్చర్‌ ఎల్లా గిబ్సన్‌ 373 పాయింట్లతో టాప్‌లో ఉండగా, సురేఖ 236 పాయింట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది. కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ కేటగిరీలో టాప్‌కి చేరుకున్న సురేఖ మహిళల టీమ్‌ విభాగంలో ఏడవ స్థానంలో ఉంది.

Updated Date - 2023-04-26T01:40:37+05:30 IST