Hardik Pandya: ఆ క్యాచ్ విషయంలో నమ్మకం లేదు.. సాహాపై నమ్మకంతో డీఆర్‌ఎస్ కోరిన హార్దిక్.. తర్వాత ఏం జరిగిందో చూడండి..

ABN , First Publish Date - 2023-04-14T08:33:53+05:30 IST

క్రికెట్‌లో వికెట్ కీపర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ నిర్ణయం సరైందా? కాదా? అనే విషయంలో కీపర్‌కే ఎక్కువ క్లారిటీ ఉంటుంది.

Hardik Pandya: ఆ క్యాచ్ విషయంలో నమ్మకం లేదు.. సాహాపై నమ్మకంతో డీఆర్‌ఎస్ కోరిన హార్దిక్.. తర్వాత ఏం జరిగిందో చూడండి..

క్రికెట్‌లో వికెట్ కీపర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ నిర్ణయం సరైందా? కాదా? అనే విషయంలో కీపర్‌కే ఎక్కువ క్లారిటీ ఉంటుంది. డీఆర్ఎస్ తీసుకోవాలో, వద్దో అని నిర్ణయించకునే ముందు కెప్టెన్లు కీపర్లనే సంప్రదిస్తారు. డీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకునే విషయంలో ధోనీ (MS Dhoni) మాస్టర్. ధోనీ డీఆర్‌ఎస్ అడిగాడంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ అవుట్ అని సగం నిర్ధారణ జరిగినట్టే. తాజాగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యా‌చ్‌లో (GTvsPBKS) అలాంటి సీనే రిపీట్ అయింది. .

పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రమాదకర జితేష్ శర్మ (Jitesh Sharma) బ్యాటింగ్ చేస్తున్నాడు. 14వ ఓవర్ బౌలింగ్ చేస్తున్న మోహిత్ (Mohit Sharma) వేసిన రెండో బంతిని జితేష్ బ్యాక్‌ఫుట్ డ్రైవ్ ఆడడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి కీపర్ సాహా (Wriddhiman Saha) చేతుల్లో పడింది. వెంటనే సాహా అప్పీలు చేశాడు. అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. బౌలర్ మోహిత్ అయితే అప్పీల్ కూడా చేయలేదు. అయితే కెప్టెన్ హార్దిక్ (Hardik Pandya) మాత్రం సాహాపై నమ్మకం ఉంచి చివరి క్షణంలో డీఆర్‌ఎస్ (DRS) తీసుకున్నాడు.

PBKSvsGT: టాస్ అనంతరం ధవన్‌కు హార్దిక్ ముద్దు.. ఇద్దరూ ఎలాంటి స్నేహితులంటే..

రీప్లేలో కనిపించినదాన్ని చూసి గుజరాత్ ఆటగాళ్లు షాకయ్యారు. ఎందుకంటే బంతి జితేష్ బ్యాట్ ఎడ్జ్‌కు తగిలినట్టు ఆ వీడియోలో స్పష్టమైంది. దీంతో అంపైర్ జితేష్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఊహించని విధంగా వికెట్ దక్కడంతో గుజరాత్ టీమ్ సంతోషంలో మునిగిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-04-14T08:33:53+05:30 IST