Yashasvi Jaiswal: టీమిండియాలో జైస్వాల్‌కు స్థానం? ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఏమన్నాడంటే..
ABN , First Publish Date - 2023-05-01T14:35:18+05:30 IST
ప్రస్తుత ఐపీఎల్‌లో యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాట్‌తో చెలరేగుతూ పరుగులు సునామీ సృష్టిస్తున్నారు. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు.
ప్రస్తుత ఐపీఎల్‌లో (IPL 2023) యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. బ్యాట్‌తో చెలరేగుతూ పరుగులు సునామీ సృష్టిస్తున్నారు. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఆ జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లాడిన జైస్వాల్ 428 పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా (Orange Cap) టాప్‌లో ఉన్నాడు.
ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో (MIvsRR) జైస్వాల్ శతకం సాధించాడు. దీంతో యశస్విపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా జైస్వాల్‌ను ప్రశంసించాడు. ``జైస్వాల్‌ను గతేడాది నుంచి గమనిస్తున్నా. అతడి ఆటతీరు రోజురోజుకూ మెరుగవుతోంది. కేవలం రాజస్థాన్ టీమ్‌కే కాదు.. భారత క్రికెట్‌కు కూడా మంచి ఆటగాడు దొరికినట్టేన``ని రోహిత్ అభిప్రాయపడ్డాడు. మాజీలు కూడా జైస్వాల్ భవితవ్యం గురించి అంచనా వేస్తున్నారు.
Sanju Samson Cheating: రోహిత్ శర్మ నాటౌట్.. సంజూ శాంసన్ చీటింగ్ చేశాడంటూ ఆరోపణలు!
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరలోనే టీ-20 క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాకప్ ఓపెనర్‌గా జైస్వాల్ వంటి ఆటగాళ్లకు ఛాన్సు దొరికే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే ఈ ఏడాదే జైస్వాల్ టీమిండియా తరఫున అరంగేట్రం చేసే ఛాన్సుందని మాజీలు అంచనా వేస్తున్నారు.