Iphone Warning: ఐఫోన్ యూజర్లూ, ఈ పని అస్సలు చేయొద్దు.. యాపిల్ కంపెనీ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2023-08-23T22:37:48+05:30 IST

చాలామంది నిద్రపోయే సమయంలో తమ మొబైల్ ఫోన్‌ని పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. కొందరైతే.. ఫోన్‌కి చార్జింగ్ పెట్టేసి, అలాగే వదిలేసి దాని పక్కనే పడుకుంటుంటారు. ఇలా నిద్రించడం వల్ల ఎన్నో...

Iphone Warning: ఐఫోన్ యూజర్లూ, ఈ పని అస్సలు చేయొద్దు.. యాపిల్ కంపెనీ స్ట్రాంగ్ వార్నింగ్

చాలామంది నిద్రపోయే సమయంలో తమ మొబైల్ ఫోన్‌ని పక్కనే పెట్టుకుని నిద్రపోతుంటారు. కొందరైతే.. ఫోన్‌కి చార్జింగ్ పెట్టేసి, అలాగే వదిలేసి దాని పక్కనే పడుకుంటుంటారు. ఇలా నిద్రించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశాలూ ఉన్నాయి. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఎన్నో అధ్యయనాలు బయటకు రాగా.. ఇప్పుడు తాజాగా యాపిల్ సంస్థ కూడా తమ ఐఫోన్ యూజర్లకు స్పష్టమైన సూచనలు జారీ చేసింది.


రాద్రి నిద్రపోయే టైంలో ఫోన్ తమ పక్కనే పెట్టుకుని నిద్రపోకూడదని, అలాగే చార్జింగ్ పెట్టి దాని దగ్గరే పడుకోకూడదని యాపిల్ సంస్థ హెచ్చరించింది. వెలుతురుగా ఉన్న వాతావరణంలోనో, ఫ్లాట్‌గా ఉండే టేబుల్ వంటి ఉపరితలాలపైనో ఫోన్ ఉంచి చార్జింగ్ పెట్టాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, మానవ శరీరాలు వంటి మృదువైలన ఉపరితలాలపై మాత్రం చార్జింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదని వెల్లడించింది. ఎందుకంటే.. ఫోన్ చార్జ్ అవుతున్నప్పుడు, ఐఫోన్లలో కొంత వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి ఫోన్ నుంచి బయటకు విడుదల అవ్వాలంటే, దాన్ని ఓపెన్ ప్లేస్‌లో ఉంచాల్సి ఉంటుంది. అలా కాకుండా దాన్ని కప్పేస్తే.. ఫోన్ కింది భాగం కాలిపోవడం, అది తీవ్రమైతే మంటలు రేకెత్తడం వంటి ప్రమాదాలు సంభవించవచ్చని యాపిల్ సంస్థ పేర్కొంది.

అందుకే.. ఫోన్‌ను చార్జ్ చేస్తున్నప్పుడు దాని పక్కన గానీ, లేదా ఫోన్‌ను దిండు కింద పెట్టుకోవడం కానీ చేయొద్దని యాపిల్ సంస్థ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. అంతేకాదు.. ఫోన్‌ని చార్జ్ చేస్తున్నప్పుడు, దాన్ని వాడొద్దని కూడా తెలిపింది. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే.. చార్జింగ్ తొలగించి వాడితే ఉత్తమమని పేర్కొంది. దెబ్బతిన్న కేబుల్స్, ఛార్జర్లను అస్సలు ఉపయోగించవద్దని సూచించింది. తేమ ఉన్నప్పుడు కూడా ఛార్జింగ్ చేయకూడదని కీలక సలహా ఇచ్చింది. కాబట్టి.. ఐఫోన్ యూజర్లూ, తస్మాత్ జాగ్రత్త! కొంచెం నిర్లక్ష్యం వహించినా.. ప్రాణాల మీదకే వచ్చే ప్రమాదం ఉంది.

Updated Date - 2023-08-23T22:37:48+05:30 IST