Meta: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం.. వెంటనే...
ABN , First Publish Date - 2023-06-17T19:35:28+05:30 IST
ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సేవలకు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సేవలకు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. మెటా (Meta) యాజమాన్యానికి చెందిన యాప్‌లు శుక్రవారం వేలాది మంది వినియోగదారులకు అంతరాయం కలిగించాయి. ఒకానొక సమయంలో దాదాపు 20,000 మంది వినియోగదారులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెటా మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్‌లను యాక్సెస్ చేయడంలో సమస్య ఎదుర్కొంటున్నట్లు అవుట్‌టేజ్-ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటేక్టోర్ పేర్కొంది. దీంతో వెంటనే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోని సేవలను పునరుద్ధరించామని మెటా యాజమాన్యం పేర్కొంది.
సేవల అంతరాయంపై నివేదికల్లో పేర్కొన్న కొద్దిసేపటికే సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు మెటా ట్విట్టర్‌లో ప్రకటించింది. అయితే అంతరాయం సమస్యలు ప్రపంచవ్యాప్తంగా లేవని, ఇండియాలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ చాలా మంది వినియోగదారులకు బాగా పని చేస్తున్నాయని మెటా పేర్కొంది.