iPhone: ఐఫోన్‌లో పంపిన మెసేజ్‌లను అన్‌డు, ఎడిట్ ఎలా చేయాలంటే?
ABN , First Publish Date - 2023-01-29T18:54:14+05:30 IST
యాపిల్ ఐఫోన్(Apple iPhone)లో పంపిన మెసేజ్‌లను ఎడిట్(Edit), అన్‌డు(Undo) చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా?
హైదరాబాద్: యాపిల్ ఐఫోన్(Apple iPhone)లో పంపిన మెసేజ్‌లను ఎడిట్(Edit), అన్‌డు(Undo) చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? ఐవోఎస్ 16(iOS 16)తో ఈ ఫీచర్‌ను గతేడాదే యాపిల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్ ద్వారా పంపిన మెసేజ్‌లను ఎడిట్, కావాలంటే అన్‌డు చేసుకునేందుకు ఐవోఎస్ 16, ఐపాడ్ ఓఎస్ 16.1, మ్యాక్ ఓఎస్ వెంచ్యూరా లేదంటే ఆ తర్వాతి వెర్షన్లలో ఐమెసేజెస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే, మెసేజ్ అందుకున్న యూజర్ మాత్రం ఐవోఎస్, ఐపాడ్ ఓఎస్, మ్యాక్ ఓఎస్ పాత వెర్షన్లను ఉపయోగిస్తే మాత్రం మెసేజ్‌ను ఎడిట్ చేసినా, అన్‌డు చేసినా వారికి మాత్రం పాత మెసేజే కనిపిస్తుంది.
యాపిల్ ఐఫోన్‌లో మెసేజ్‌లను అన్‌డు ఎలా చేయాలో చూద్దాం
* అన్‌సెండ్ చేయాలనుకున్న మెసేజ్‌ను టచ్ చేసి వేలిని అలాగే ఉంచాలి.
* ఇప్పుడు ‘అన్‌డు సెండ్’పైన ట్యాప్ చేయాలి. దీంతో చాట్ నుంచి మెసేజ్ అదృశ్యమైపోతుంది. ఆ వెంటనే ‘యు అన్‌సెంట్ ఎ మెసేజ్ (You unsent a message) అని నోటిఫికేషన్ వస్తుంది.
* అయితే, మెసేజ్‌ను పంపిన రెండు నిమిషాల లోపే అన్‌డూ చేసుకునే వీలుంది. ఆ తర్వాత మాత్రం కుదరదు.
ఎడిట్ ఇలా..
* పైన పేర్కొన్నట్టే మెసేజ్‌ను ఓపెన్ చేయాలి.
* ఎడిట్ చేయాలనుకున్న మెసేజ్‌పై ట్యాప్ చేసి హోల్డ్ చేయాలి.
* ఇప్పుడు ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు అవసరమైనట్టుగా మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చెక్‌మార్క్‌పై ట్యాప్ చేసి మెసేజ్‌ను ఫైనలైజ్ చేసుకోవాలి. ఒకవేళ మెసేజ్‌లో మార్పులు చేయడం ఇష్టం లేకుంటే ‘ఎక్స్’పై ట్యాప్ చేస్తే ఒరిజనల్ మెసేజ్ వచ్చేస్తుంది.
* ఎడిట్ చేయాలనుకున్న మెసేజ్ కింద ‘ఎడిటెడ్’(Edited) పదం కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయడం ద్వారా ఎడిట్ హిస్టరీని తెలుసుకోవచ్చు. 15 నిమిషాల వ్యవధిలో ఐదుసార్లు మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవచ్చు.