Lenovo Legion Slim Series: లెనోవో లెజియన్ స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్స్ విడుదల.. ధరతోపాటు ఫీచర్స్ ఇవే..

ABN , First Publish Date - 2023-06-16T20:30:35+05:30 IST

చైనీస్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ లెనోవో (Lenovo) తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది.

Lenovo Legion Slim Series: లెనోవో లెజియన్ స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్స్ విడుదల.. ధరతోపాటు ఫీచర్స్ ఇవే..

హైదరాబాద్: చైనీస్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ లెనోవో (Lenovo) తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా గురువారం భారత మార్కెట్‌లో లెనోవో లెజియన్ స్లిమ్ సిరీస్ (Lenovo Legion Slim Series) గేమింగ్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసినట్లు కంపెనీ పేర్కొంది. లెనోవో లెజియన్ స్లిమ్ 7ఐ, లెజియన్ స్లిమ్ 7, లెజియన్ స్లిమ్ 5ఐ ల్యాప్‌టాప్‌లతోపాటు లెజియన్ స్లిమ్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్‌లో ప్రవేశపెట్టినట్లు సంస్థ తెలిపింది.

భారత మార్కెట్‌లో లెనోవో లెజియన్ స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్ ధరలు ఇలా ఉన్నాయి.

లెనోవో లెజియన్ స్లిమ్ సిరీస్ బేస్ మోడల్ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ. 1,61,990 ఉంటుంది. ల్యాప్‌టాప్స్ కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ. 3000 వరకు తగ్గింపు ఉంటుందని లెనోవో పేర్కొంది. లెనోవో యొక్క కస్టమ్ టు ఆర్డర్ (CTO)ను ఎంపిక చేసుకున్న కస్టమర్లకు రూ. 10,000 ఆర్డర్లపై రూ. 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తామని తెలిపింది.

లెనోవో లెజియన్ స్లిమ్ సిరీస్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

లెనోవో లెజియన్ స్లిమ్ 7ఐ, లెజియన్ స్లిమ్ 7, లెజియన్ స్లిమ్ 5ఐ ల్యాప్‌టాప్‌లతోపాటు లెజియన్ స్లిమ్ 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌లు విండోస్ 11 (Windows 11)తో పని చేయనున్నాయి. 16-అంగుళాల ఐపీఎస్ యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. అంతేకాకుండా లెనోవో లెజియన్ స్లిమ్ సిరీస్ ల్యాప్‌టాప్‌లు ఇ-షట్టర్‌తో కూడిన 1080పీ వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంటాయి. వాటిలో ఎస్‌డీ కార్డ్ రీడర్ కూడా ఉంటుంది.

Updated Date - 2023-06-16T20:37:08+05:30 IST