Mobile Data: అస్సలు వాడకపోయినా మొబైల్ డేటా వెంటనే అయిపోతోందా..? అయితే వెంటనే ఈ సెట్టింగ్‌ను ఆపేసుకోండి..!

ABN , First Publish Date - 2023-02-26T09:30:50+05:30 IST

మొబైల్ డేటా ఎందుకు ఖర్చైపోతోందో తెలియక సతమతమవుతుంటారు. అయితే ఒకే ఒక్క మిస్టేక్

Mobile Data: అస్సలు వాడకపోయినా మొబైల్ డేటా వెంటనే అయిపోతోందా..? అయితే వెంటనే ఈ సెట్టింగ్‌ను ఆపేసుకోండి..!

ఓటిటిలో కొత్త సినిమా రిలీజ్ అయ్యింది, సినిమా చూద్దామనుకున్నాడు విజయ్. సినిమా ప్లే చేస్తే ఎంతకూ రావడం లేదు. ఏమయ్యిందో అర్థం కాక కిందామీదా పడ్డాడు. చివరికి గమనిస్తే మొబైల్ డేటా(Mobile Data) మొత్తం ఊడ్చుకుపోయింది. విజయ్ లాగా పరిస్థితులు ఫేస్ చేస్తున్నవాళ్ళు, ఇప్పటిదాకా ఫేస్ చేసినవారు చాలామంది ఉంటారు. అసలు వాడకపోయినా మొబైల్ డేటా ఎందుకు ఖర్చైపోతోందో తెలియక సతమతమవుతుంటారు. అయితే ఒకే ఒక్క మిస్టేక్ మీ మొబైల్ లో డేటాను ఫినిష్ చేస్తుంది. మొబైల్ డేటా మీకు తెలియకుండానే ఎందుకు ఖర్చైపోతోంది, అలా కాకూడదంటే ఏం చెయ్యాలంటే..

ఇంటెర్నెట్ (Internet) లేని మొబైల్ చేతిలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనిపిస్తుంది ఈకాలంలో. మొత్తం ట్రాన్సాక్షన్స్(Transactions) అన్ని ఆన్ లైన్ లో జరుపుతుండటం వల్ల ఇంటర్నెట్ లేకపోతే పనులు జరగవు. అయితే అసలు వాడకపోయినా మొబైల్ డేటా అయిపోవడం చాలామందికి కనీసం ఒక్కసారి అయినా అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మేము డేటా వాడలేదు కానీ నెట్ వర్క్ సంస్థలు మోసం చేస్తున్నాయి అని కూడా అనుకుంటారు కొందరు. అయితే నెట్ వర్క్ సంస్థల మోసం ఏమీ లేదు, అవగాహన లేనిది మనకే.. కారణం ఏదైనా వాడకుండా డేటా అయిపోయి, అవసరం అయినపుడు డేటా లేక చిరాకు పడే సంధర్భాలు వస్తా.యి.

Read also:Success Story: 3వ తరగతి వరకే చదివిన ఇతడు కోట్లు సంపాదిస్తున్నాడంటే నమ్మగలరా..? బ్యాంక్ ముందు సెక్యూరిటీ గార్డు జాబ్‌కు రిజైన్ చేసి..


ఆండ్రాయిడ్ మొబైల్(Android Mobile) లో గూగుల్ ప్లే స్టోర్(Google play Store) ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్(Settings) లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లో నెట్వర్క్ ప్రిఫరెన్సె(Network Preference) అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చెయ్యాలి. ఇది ఓపెన్ చెయ్యగానే యాప్ డౌన్లోడ్ ప్రిఫరెన్సెస్(App download preference), ఆటో అప్డేట్ యాప్స్(Auto-update apps), ఆటో ప్లే వీడియోస్(Auto-Play Videos) అని మూడు కనిపిస్తాయి. వీటిలో ఆటో-అప్డేట్ యాప్స్ ఓపెన్ చెయ్యాలి. ఈ ఆటో అప్డేట్ యాప్స్ ఓపెన్ చేసినపుడు ఓవర్ ఎనీ నెట్వర్క్(Over Any Network), ఓవర్ వైఫై ఓన్లీ(Over wi-fi Only), డోంట్ ఆటో అప్డేట్ యాప్స్(Don't Auto-update apps) అని మూడు ఆప్షన్స్ కనబడతాయి. ఓవర్ ఎనీ నెట్వర్క్ ఆన్ లో ఉంటే యాప్స్ ను మీరు అప్డేట్ చెయ్యకపోయినా వాటికవే అప్డేట్ అయిపోతాయి. వై ఫై ఓన్లీ అనే ఆప్షన్ ఉంటే వై ఫై కనెక్షన్ ఉన్నప్పుడు మొబైల్ లో యాప్స్ వాటికవే అప్డేట్ అవుతాయి. అదే డోంట్ ఆటో అప్డేట్ యాప్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే యాప్స్ వాటికవే అప్డేట్ కాకుండా ఉంటాయి. ఈ ఒక్క సెట్టింగ్ మార్చుకుంటే చాలావరకు డేటా మీ ప్రమేయం లేకుండా ఖర్చవడాన్ని నిరోధించవచ్చు.

Updated Date - 2023-02-26T09:30:52+05:30 IST