Motorola: కొత్త ఫీచర్లతో మోటరోలా రేజర్ 40 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయ్..
ABN , First Publish Date - 2023-06-22T16:32:27+05:30 IST
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా కొత్త ఫీచర్లతో మోటరోలా రేజర్ 40 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వెల్లడించింది. ఇండియా మార్కెట్‌లో (India Market) వచ్చే నెలలో మోటరోలా రేజర్ 40 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఇదే ఫోన్లను చైనా మార్కెట్‌లో ఈ నెలలో విడుదల చేశారు. మోటరోలా రేజర్ 40, మోటరోలా రేజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి.
మోటరోలా ఫోన్ల ధరలు
మోటరోలా రోజర్ 40 ఫోన్ రూ. 46,000, మోటరోలా రేజర్ 40 అల్ట్రా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రూ. 66,000 ఉంటుంది.
మోటరోలా ఫోన్ల ఫీచర్స్..
రెండు ఫోన్లు 6.9-అంగుళాల pOLED డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. రోజర్ 40 అల్ట్రా 144Hz రిఫ్రెష్ రేట్‌తో 3.6-అంగుళాల ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రోజర్ 40 1.5-అంగుళాల కవర్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్- యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ సెకండరీ అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరా ఉంటుంది. రెండు ఫోన్లకు ఫ్రంట్ సెల్ఫీ అండ్ వీడియో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.