గెలాక్సీ డివైజ్‌లో నోటిఫికేషన్ హిస్టరీ
ABN , First Publish Date - 2023-04-29T00:56:57+05:30 IST
స్మార్ట్ ఫోన్లలో పేరుకుపోయిన మెసేజ్‌ల్లో కొన్నింటిని మిస్ అయ్యే ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది.
స్మార్ట్ ఫోన్లలో పేరుకుపోయిన మెసేజ్‌ల్లో కొన్నింటిని మిస్ అయ్యే ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. అయితే శాంసంగ్ సరికొత్త అప్డేట్ ‘వన్ యు1 5’ తో నోటిఫికేషన్ హిస్టరీ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా ఏమీ ఉండదు. దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. దీనికోసం సెట్టింగ్స్ మెనూలోకి వెళ్ళాలి. నోటిఫికేషన్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ ఆప్షన్‌ను టాప్ చేయాలి. నోటిఫికేషన్ హిస్టరీ ఆప్షన్‌కు సంబంధించి టోగెల్ టర్న్ చేయాలి. అప్పుడు హిస్టరీ పేజీలో నోటిఫికేషన్స్‌ను కనుగొనవచ్చు. చివరికి స్ర్కోల్ చేసుకుంటే డిస్‌మిస్డ్ నోటిఫికేషన్స్ విభాగం కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను మొదట ఎనేబుల్ చేసుకున్నప్పుడు హిస్టరీ ఖాళీగా కనిపిస్తుంది. ఆపై మాత్రమే నోటిఫికేషన్స్ మానిటిరింగ్‌కు ఆస్కారం కలుగుతుందని గుర్తించాలి.