రూ. 450కే డెంగీకి చికిత్స

ABN , First Publish Date - 2023-10-05T04:26:17+05:30 IST

ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి బారిన పడ్డవారికి చికిత్స అందించగా.. వారు నాలుగు రోజుల్లోనే కోలుకున్నారని, ప్రస్తుతం డెంగీ బారిన పడ్డ వారికి చికిత్స చేస్తే..

రూ. 450కే డెంగీకి చికిత్స

ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ సహకరించాలి: డాక్టర్‌ వసంత్‌

పంజాగుట్ట, అక్టోబరు4 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి బారిన పడ్డవారికి చికిత్స అందించగా.. వారు నాలుగు రోజుల్లోనే కోలుకున్నారని, ప్రస్తుతం డెంగీ బారిన పడ్డ వారికి చికిత్స చేస్తే.. ఒక్క రోజులోనే వారి శరీరంలో ప్లేట్‌లెట్స్‌ పెరుగుతున్నాయని సుల్తాన్‌బజార్‌ యూపీహెచ్‌సీ సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ జి.వసంత్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ సహకరిస్తే.. డెంగీకి అతి చౌకగా చికిత్స అందజేస్తానన్నారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ‘‘నేను డెంగీతో బాధపడుతున్న వారికి ప్రపంచంలోనే అత్యుత్తమ చికిత్స అందించాను. వారికి ఒక్క రోజులోనే ప్లేట్‌లెట్స్‌ పెరిగాయి. కరోనాకు కూడా రూ.45తో చికిత్స అందించా. ఎంతోమంది కోలుకున్నారు. ప్రస్తుతం డెంగీకి రూ.450 చికిత్సతో.. రోగుల రక్తంలో ప్లేట్‌లెట్స్‌ సంఖ్యను పెంచుతున్నా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-05T04:26:17+05:30 IST