లండన్‌లో అంబేడ్కర్‌ మ్యూజియం సందర్శించిన కవిత

ABN , First Publish Date - 2023-10-07T04:36:57+05:30 IST

లండన్‌ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం అక్కడి అంబేడ్కర్‌ మ్యూజియంను సందర్శించారు.

లండన్‌లో అంబేడ్కర్‌ మ్యూజియం సందర్శించిన కవిత

హైదరాబాద్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): లండన్‌ పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం అక్కడి అంబేడ్కర్‌ మ్యూజియంను సందర్శించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ అంబేడ్కర్‌, బుద్థిస్ట్‌ అసోసియేషన్‌ యూకే సంయుక్త కార్యదర్శి శామ్‌కుమార్‌ ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు పెట్టిన విషయాన్ని అక్కడి ప్రతినిధులకు తెలిపారు. అంబేడ్కర్‌ ఆశయాలను తెలంగాణ సీఎం కేసీఆర్‌ నెరవేరుస్తున్నారని, అంబేడ్కర్‌ స్ఫూర్తితో అనేక పథకాలను అమలు చేస్తున్నారని ఆమె వివరించారు. అంబేడ్కర్‌ కేవల దళితుల కోసమే కాకుండా మహిళా హక్కుల కోసం కృషి చేశారని కొనియాడారు.

Updated Date - 2023-10-07T04:38:23+05:30 IST