Tenth Papers Missing : తెలంగాణలో టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయంపై పోలీసులు ఏం తేల్చారంటే..

ABN , First Publish Date - 2023-04-04T18:43:19+05:30 IST

Tenth Papers Missing : తెలంగాణలో టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయంపై పోలీసులు ఏం తేల్చారంటే.. Adilabad Police Gives Clarity Over Tenth Answer Sheets Missing Nag

Tenth Papers Missing : తెలంగాణలో టెన్త్ ఆన్సర్ షీట్స్ మాయంపై పోలీసులు ఏం తేల్చారంటే..

ఆదిలాబాద్ : తెలంగాణలో టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకుల (TSPSC Paper Leakage) బెడద ఇంకా కొలిక్కి రాకముందే.. వరుసగా పదో తరగతి పరీక్షల పత్రాలు (10th Exam Papers) లీకవ్వడంతో రాష్ట్ర విద్యాశాఖలో అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో కేసీఆర్ సర్కార్‌పై (KCR Govt) ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. పేపర్ లీకుల సంగతి పక్కనెడితే.. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని (Adilabad) ఉట్నూరు మండల కేంద్రంలో పదో తరగతి విద్యార్థుల ఆన్సర్ షీట్స్ (10th Students Answer Sheets) మాయం అయ్యాయి. అటు లీక్.. ఇటు మిస్సింగ్ ఈ వరుస ఘటనలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. మొత్తం 20 మంది విద్యార్థుల జవాబు పత్రాలు కనిపించకుండా పోయినట్లు మొదట వార్తలు వచ్చాయి. తపాలా కార్యాలయం నుంచి ఉట్నూర్ బస్టాండ్‌కు తరలిస్తుండగా ఆటో నుంచి మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పేపర్లు ఆటోలో తరలిస్తుండగా.. కిందపడిపోయి ఉంటాయా..? లేదంటే ఎవరైనా కావాలని మాయం చేశారా..? అనే తేల్చే పనిలో పడ్డారు. మంగళవారం సాయంత్రానికి ఈ ఆన్సర్ షీట్స్ మాయమైన వ్యవహారంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి అసలేం జరిగిందో తేల్చారు.

అసలేం జరిగిందంటే..!

మాయమైన ఆన్సర్ షీట్స్ సప్లిమెంటరీ విద్యార్థులవిగా నిర్ధారణకు వచ్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మొత్తం 9 మంది విద్యార్థుల ఆన్సర్ షీట్స్ పోయినట్టు గుర్తించామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. అయితే.. తమ తప్పేమీ లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. తపాలా శాఖ నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని విద్యాశాఖ అధికారులు, పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఆన్సర్ షీట్స్ మాయంపై అన్నికోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. ఆన్సర్ షీట్స్ తరలించే క్రమంలో తపాలశాఖ అత్యంత నిర్లక్ష్యంగా, కనీసం ఎస్కార్ట్ కూడా లేకుండా వ్యవహరించిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ..

ఇదిలా ఉంటే.. జవాబు పత్రాల మిస్సింగ్‌పై విద్యాశాఖ తీవ్ర ఆగ్రహానికి లోనైంది. పోస్టల్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే జవాబు పత్రాలు మిస్ అయ్యాయని ఆదిలాబాద్ డీఈవో ప్రణీత ఇదివరకే ప్రకటించారు. ఆన్సర్ షీట్ మిస్సింగ్‌లో విద్యాశాఖ తప్పిదం లేదని ప్రణీత చెబుతున్నారు. మరోవైపు.. టెన్త్ పరీక్షల పత్రాలు వరుసగా రెండోరోజు కూడా లీకయ్యాయి. దీనిపై కలెక్టర్లతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కాన్ఫరెన్స్ అనంతరం సబిత మీడియా మీట్ నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Updated Date - 2023-04-04T18:50:34+05:30 IST