తెలంగాణలో వ్యవసాయం సస్యశ్యామలం
ABN , First Publish Date - 2023-06-04T00:24:01+05:30 IST
తెలంగాణలో వ్యవసాయం సస్యశ్యామలమైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామం రైతువేదిక ప్రాంగణంలో వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతు దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
భూదాన్‌పోచంపల్లి, జూన్ 3: తెలంగాణలో వ్యవసాయం సస్యశ్యామలమైందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్ గ్రామం రైతువేదిక ప్రాంగణంలో వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రైతు దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. రైతులు వ్యవసాయాన్ని పండుగలా చే సుకోవాలని, వారు సాధించిన విజయాలతోపాటు మున్ముందు తక్కువ పెట్టుబడితో అధి క దిగుబడిని సాధించే విధంగా రైతులు తెలంగాణలోని 2,601 రైతు ప్రాంగణాల్లో ఉత్సవాల ద్వారా తెలియజేయాలన్నారు. రైతుల సంక్షేమంకోసం సీఎం కేసీఆర్ అనేక పథకా లు అమలు చేస్తున్నారని, వ్యవసాయంపై ఆధారపడిన రైతులతో నేడు వ్యవసాయరం గం సస్యశ్యామలంగా అలరారుతోందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంటు, చెరువుల పునరుద్ధరణతో భూగర్భజలాలు పెరిగాయని, వ్యవసాయానికి మహర్దశ కలిగిందన్నారు. గతంలో తాను ఇక్కడ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో వరి అంతగా సాగులో లేదన్నారు. వానాకాలంలోనూ ఆముదం లాంటి పంటలు పండించేవారన్నారు. నేడు మూసీ పరివాహకంలో అత్యధికంగా వరి పండిస్తున్నారని, ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోందన్నారు. కేసీఆర్ కలలుగన్న తెలంగాణ సాకారం అయిందని, ప్రత్యక్షంగా చూ స్తున్నానన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలాసత్పథి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ రాజే్‌షచంద్ర, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా పంచాయతీ అధికారి సు నంద, ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటే్‌షయాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామియాదవ్, ఆత్మ చైర్మన్ కందాడి సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, తహసీల్దారు బి వీరాబాయి, ఎంపీడీవో ఎ బాలశంకర్, ఎంఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, ఏవో ఎజాజ్ అలీఖాన్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ రావుల శేఖర్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యుడు గోరంటి శ్రీనివా్‌సరెడ్డి, స్థానిక సర్పంచ్ పర్నె రజిత మల్లారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రసాయన పరిశ్రమలను తరలించాలి
భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెంతోపాటు నారాయణగిరి ప్రాంతాల్లోని కాలుష్య కారక రసాయన పరిశ్రమలను ఇక్కడి నుండి తరలించాలని సీఎస్ శాంతికుమారికి నాయకులు పగిల్ల రాంరెడ్డి, రావుల శేఖర్‌రెడ్డి వినతిపత్రాన్ని అం దజేశారు. తమ గ్రామాల్లోని హెజిలో, ఆప్టిమస్, ఆర్కెమెడిస్, కెమిక్, ఎస్‌వీఆర్, విజయసాయి, సిలికాన్, బృందావన్, ఆర్టిన్, శ్రీజయ తదితర కంపెనీలు గాలిలోకి విషవాయువు లు వదులుతున్నారని అన్నారు. నీరు, నేల, గాలి కాలుష్యమై దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. అదే విధంగా భూదాన్‌పోచంపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పా టు చేయాలని, ప్రపంచ ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ఉస్సేన్ సాగర్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత సమస్యలపై జిల్లా చేనేత నాయకుడు అంకం పాండు వినతి పత్రాన్ని అందజేశారు.