బోనులో చిక్కిన ‘అలిపిరి’ చిరుత!
ABN , First Publish Date - 2023-06-25T01:57:11+05:30 IST
మూడురోజుల క్రితం తిరుమల నడక మార్గంలో నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో పడింది!.
తిరుమల, జూన్ 23 (ఆంధ్రజ్యోతి) : మూడురోజుల క్రితం తిరుమల నడక మార్గంలో నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసిన చిరుత ఎట్టకేలకు బోనులో పడింది!. అలిపిరి నుంచి వెళ్లే దారిలో ఏడో మైలు వద్ద గురువారం రాత్రి ఓ బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఉదయం టీటీడీ, అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాల్లో రెండు బోన్లను, 30 కెమెరాలను ఏర్పాటు చేశారు. రాత్రి 10.45 గంటల సమయంలో ఏడాదిన్నర వయస్సు కలిగిన చిరుత బోనులో చిక్కుకుంది. శనివారం ఉదయం చిరుతను ప్రత్యేక వ్యాన్‌లో కల్యాణి డ్యాం వైపునున్న అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. రాత్రి వేళలో తిరుమల నడక మార్గాలను మూసివేస్తామంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.