Share News

Adilabad : ఆదిలాబాద్‌లో నిశ్శబ్ద విప్లవం!

ABN , First Publish Date - 2023-11-26T02:30:18+05:30 IST

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏం జరుగుతోంది? ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇవ్వనున్నారు? ఏ పార్టీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టనున్నారు? ఇప్పుడు అందరిలోనూ ..

Adilabad : ఆదిలాబాద్‌లో నిశ్శబ్ద విప్లవం!

ఆదివాసీ గూడేల్లో కనిపించని హడావిడి

ఓటర్లు ఎటువైపు ఉంటారోనన్న ఉత్కంఠ

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏం జరుగుతోంది? ఓటర్లు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇవ్వనున్నారు? ఏ పార్టీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టనున్నారు? ఇప్పుడు అందరిలోనూ ఇదే ఉత్కంఠ నెలకొంది. ఆ జిల్లాలోని ఆదివాసీ గూడేలు, మారుమూల గ్రామాల్లో ఎన్నికల హడావిడి ఏమాత్రం కనిపించకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే.. ఆదిలాబాద్‌ జిల్లా పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అందులో ఆసిఫాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో ఆదివాసీ గిరిజన ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అభ్యర్థుల గెలుపోటముల్లో వారి ఓట్లే కీలకమవుతాయి.

కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంతో హోరెతిస్తున్న రాజకీయ పార్టీలు.. ఈ జిల్లాలోని ఆదివాసీ గూడేలు, మారుమూల గ్రామాలకు వెళ్లడంలేదు. ఆ పార్టీ అభ్యర్థి కూడా ఇంకా ఆ ప్రాంతాలకు వెళ్లలేదు. దీంతో ఆదివాసీ గిరిజన ఓటర్లు కూడా నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్నారు. నాయకులు తమ వద్దకు వస్తారని, తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి.. వాటిని పరిష్కరించే వారికే తమ ఓటు వేస్తామని చెప్పేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ, ఇప్పటికీ తమ వద్దకు ఎవరూ రాకపోవడంతో.. చివరికి వారు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకుగాను గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 9 స్థానాలను గెలుచుకుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కొంత భిన్నమైన ఫలితాలు రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి ఈ జిల్లాలోని సిర్పూర్‌లో బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేస్తుండడంతో ఆ నియోజకవర్గం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌- ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-11-26T02:30:20+05:30 IST