Share News

CLP Meet: సీఎల్పీ లీడర్ ఎంపికపై ఏకవాక్య తీర్మానం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2023-12-04T14:01:10+05:30 IST

కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా(సీఎల్పీ) ఎవరు ఉండాలనే దానిపై హై కమాండ్ నిర్ణయమే తమ నిర్ణయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ మేరకు సీఎల్పీ సమావేశంలో ప్రవేశించిన ఏకవాక్య తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బలపరిచారు.

CLP Meet: సీఎల్పీ లీడర్ ఎంపికపై ఏకవాక్య తీర్మానం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) నేతగా ఎవరు ఉండాలనే దానిపై హై కమాండ్ నిర్ణయమే తమ నిర్ణయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. ఈ మేరకు సీఎల్పీ సమావేశంలో ప్రవేశించిన ఏకవాక్య తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బలపరిచారు. ఈ తీర్మానాన్ని హై కమాండ్‌కి తెలియచేసి హై కమాండ్ నిర్ణయం తెలియజేస్తామన్ని పరిశీలకుడిగా ఉన్న డీకే శివకుమార్ మీడియాకి తెలిపారు.

తెలంగాణ ఎన్నికల్లో అప్పగించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానాన్ని ఆమోదించామని డీకే శివ కుమార్ మీడియాకి వెల్లడించారు. సీఎల్‌పీ నేత ఎంపికపై ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకున్నామని, సీఎల్పీ ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించాలని ఎమ్మెల్యేలు చెప్పారని డీకే శివ కుమార్ వివరించారు. ఖర్గే నిర్ణయాన్ని శిరసావహిస్తామని ఎమ్మెల్యేలు తీర్మానంలో తెలిపినట్టు చెప్పారు.


దాదాపు గంటపాటు కొనసాగిన సీఎల్పీ ముగిసింది. గచ్చిబౌలిలోని ‘హోటల్ ఎల్లా’లో ఈ సమావేశం జరిగింది. ఈ కీలక భేటీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు.రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, కొండా సురేఖతోపాటు పలువురు సీనియర్లు నేతలు పాల్గొన్నారు. డీకే శివకుమార్‌తో పాటు దీప్‌దాస్‌ మున్షీ, జార్జ్‌, అజయ్‌, మురళీధరన్‌ ఏఐసీసీ పరిశీలకులుగా హాజరయ్యారు.

Updated Date - 2023-12-04T14:08:40+05:30 IST