Nizamabad: స్వతంత్ర అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-11-19T10:39:18+05:30 IST
నిజామాబాద్: అర్బన్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని సాయినగర్‌లో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కన్నయ్య గౌడ్‌కు ఎన్నికల కమిషన్ రోటీ మేకర్ గుర్తు కేటాయించింది.
నిజామాబాద్: అర్బన్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి (Independent Candidate) కన్నయ్య గౌడ్ (Kannayya Goud) ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు. నగరంలోని సాయినగర్‌లో తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కన్నయ్య గౌడ్‌కు ఎన్నికల కమిషన్ రోటీ మేకర్ (Roti Maker) గుర్తు కేటాయించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియవచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల నిర్వహణపై విధి విధానాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా కన్నయ్య గౌడ్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన వ్యక్తుల బెదిరింపులకు పాల్పడడంతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు అంటున్నారు. మరోవైపు మృతుడి ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండో రోజుల్లో గృహప్రవేశం ఉండగా కన్నయ్య గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.