KCR: సెక్యూరిటీ లేకుండా.. ప్రైవేటు కారులో ఫాంహౌస్‌కు
ABN , First Publish Date - 2023-12-04T04:22:46+05:30 IST
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను కేసీఆర్ ఖాళీ చేశారు.
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తన అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను కేసీఆర్ ఖాళీ చేశారు. ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చిన ఆయన రాజ్యసభ సభ్యుడు సంతో్‌షను పిలిచి.. ‘‘నీ కారుందా? తియ్.. ఫాంహౌస్‌కు వెళదాం’’ అని చెప్పారు. దీంతో సంతోష్ తన కారు తీసుకొచ్చారు. ముందు భాగంలో డ్రైవర్, సంతోష్ కూర్చుండగా కేసీఆర్ వెనుక సీట్లో కూర్చొని ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు బయలుదేరి వెళ్లారు. భద్రతా కాన్వాయ్‌ని వెంట రావద్దని వారించారు. రోడ్డుమీద ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డ చోటల్లా.. కారును నిలుపుతూ సామాన్యుడిలా ఆయన సాదా సీదాగా ప్రయాణించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నేతలు గ్యాదరి బాలమల్లు, శ్రీనివా్‌సరెడ్డి మరో కారులో వెళ్లారు.