Share News

దాడులకు పాల్పడితే సహించేది లేదు : ఎంపీ

ABN , Publish Date - Dec 30 , 2023 | 12:08 AM

బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని ఎంపీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

 దాడులకు పాల్పడితే సహించేది లేదు : ఎంపీ
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురే్‌షను పరామర్శిస్తున్న ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌) / సూ ర్యాపేట సిటీ, డిసెంబరు 29 : బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేదిలేదని ఎంపీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న అర్వపల్లి మండలం కాసర్లపాడు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త సురే్‌షను పరామర్శించి, మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎక్కడా దాడులకు పాల్పడలేదన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం సమంజసం కాదన్నారు. ఆయన వెంట జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సోమే్‌షగౌడ్‌, నాయకులు రామలింగయ్య తదితరులు ఉన్నారు.

ప్రజా పాలన పేరుతో మోసగిస్తున్న కాంగ్రెస్‌

సూర్యాపేట(కలెక్టరేట్‌) : అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసగిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపణలపై విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఎలాంటి దరఖాస్తులు లేకుండా ఆనలైన పద్ధతిలో దళారుల వ్యవస్థ లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీల దరఖాస్తుఫారాలు అసంబద్ధంగా ఉన్నాయని, కౌలు రైతులను పాస్‌పుస్తకం నెంబర్లు అడుగుతున్నారని ధ్వజమెత్తారు. పరిపాలన చేయమని అధికారమిస్తే శ్వేతపత్రాలంటూ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలు వెంటబడి తరుముతారని విమర్శించారు.

అప్పులు లేకుండా పనిచేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని అలా చేస్తే కాంగ్రెస్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తామని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, గండూరి ప్రకాష్‌, జీడి భిక్షం, బూర బాలసైదులుగౌడ్‌, పుట్టా కిశోర్‌కుమార్‌, కర్ణాకర్‌రెడ్డి, తూడి నర్సింహ్మారావు తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 30 , 2023 | 12:08 AM