Home » Nalgonda News
Pranay case : తెలంగాణ వ్యాప్తంగా పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసు సంచలనం సృష్టించింది. ఇవాళ నల్గొండ జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
Pranay Case: తెలంగాణ వ్యాప్తంగా పెరుమాళ్ల ప్రణయ్ హత్యకేసు సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో విచారణ తుది దశకు చేరుకుంది. ఇవాళ నల్గొండ జిల్లా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
కోపంతో ఆ భర్త భార్యను నెట్టేస్తే రోడ్డు మీద పడింది.. మరో ఘటనలోనూ భర్త ఇలానే నెట్టేస్తే భార్య తల గోడకు తగిలింది. ఈ రెండు ఘటనల్లోనూ ఇద్దరూ ప్రాణాలొదిలారు.
రుణం చెల్లించకపోతే భూమిని స్వాధీనం చేసుకుంటామని బ్యాంకు అధికారులు హెచ్చరించడంతో ఓ రైతు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఎస్సారెస్పీ కాల్వ ద్వారా గోదావరి జలాలు రాకపోవడంతో తమ పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Minister Komatireddy Venkatareddy: ఎస్ఎల్బీసీ పనుల ప్రాజెక్ట్ ఆలస్యంపై అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. SLBC, బ్రాహ్మణవెళ్లాంల ప్రాజెక్ట్లు తనకు తొలి ప్రాధాన్యమన్నారు. SLBC ఒక వరల్డ్ వండర్.. SLBC పూర్తయితే.. ప్రపంచమంతా వచ్చి చూస్తుందని అన్నారు.
డ్రైవర్ నిద్రమత్తు కారణంగా పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. నల్గొండ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాళ్ల కుప్పను ఢీకొట్టి ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ దాడి ఘటనపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. 'మానవత్వమా నీ జాడెక్కడ.? మూగజీవులకు ఉన్న మానవత్వం కూడా మనిషికి లేదా..?. ఎటు పోతోందీ సమాజం.?. ఇలాంటి సమాజంలో మనుగడ సాగిస్తున్నామా.. అని తలుచుకుంటేనే బాధేస్తోంది.' అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవల్సిన టీచర్లు గాడి తప్పుతున్నారు.
తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న హైదరాబాద్ - విజయవాడ ఎన్హెచ్ - 65 విస్తరణకు అడుగు పడింది. ఈ మార్గాన్ని ఆరు వరసలుగా నిర్మించాలని తొలుత డీపీఆర్ రూపకల్పనకు టెండర్లు పిలిచినప్పటికీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదన, ప్రజా ప్రతినిధుల అభ్యర్థన, స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు ఎనిమిది లేన్ల విస్తరణ అంశంపైనా ఎన్హెచ్ అధికారులు దృష్టి సారించారు.